-రేవంత్ మాటలతో మరోసారి స్పష్టం
-చంద్రబాబు కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది
-ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ పెన్షన్ లు పెంచుతామని ఎలా ప్రకటించారు?
-రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటున్నాడు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుంది. మళ్ళీ పాతరోజులు వస్తాయి. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
బీజేపీ మోటార్లు కు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి.కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయేవారు. కాంగ్రెస్, బీజేపీని బంగాళాఖాతంలో పాతేయాలి. కాంగ్రెస్ దళారుల కోసం, బీజేపీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారు.రైతులు మేల్కొని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి.
రేవంత్ మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి స్పష్టం అయింది..మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వస్తుంది.. రైతుల పై అనుచిత వ్యాఖ్యలుచేసిన చంద్రబాబు కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది.. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ పెన్షన్ లు పెంచుతామని ఎలా ప్రకటించారు.. అది అవస్తవమా సమాధానం చెప్పాలి.. రైతులు రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీకి చెంప చెళ్లమనిపించే విధంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నా.బుధవారం రైతులతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం.