Suryaa.co.in

National Telangana

నరేంద్రమోదీ అభినవ గరళ కంఠడు

-కాంగ్రెస్ చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లు కంఠంలో నింపుకుని ప్రజల కోసం భరిస్తున్న మోదీ
-దేశ ప్రజల హితం కోసం నిరంతరం పనిచేస్తున్న మహానేత నరేంద్రమోదీ
– బాంబు పేలుళ్లకు పాల్పడ్డ లుచ్చాలకు ఆశ్రయమిచ్చే నాకొడుకులను ఉరికించి కొట్టాలే..
-బొట్టు చెరిపేసుకునే పార్టీలకు మనకు అవసరమా?
-పీఎఫ్ఐని కూకటివేళ్లతో పెకలించి వేసి పారేయాల్సిందే
-బీజేపీ ఓడిపోతే కర్నాటక అభివృద్ధి ఆగిపోతోంది
-దేశవ్యాప్త ఎన్నికలకు కర్నాటకను ఏటీఎంలా వాడుకునేందుకే కాంగ్రెస్ ప్లాన్
– బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినవ గరళకంఠుడు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లుగా కంఠంలో దాచుకుంటూ ప్రజల కోసం పనిచేస్తూ దేశాన్ని అభివ్రుద్ధివైపు నడిపిస్తున్నారని అన్నారు. ఓ వర్గం వాళ్ల ఇంటికిపోయి మల్లిఖార్జున ఖర్గే బొట్టును ఎందుకు చెరిపివేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొట్టు చెరిపేసుకునే వాళ్ల పార్టీలకు కర్నాటక ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. బాంబు పేలుళ్లకు పాల్పడ్డ లుచ్చాలకు చింతామణిలో ఆశ్రయమిచ్చిన నాకొడుకుల అంతు చూడాలన్నారు. అలాంటి బాంబు పేలుళ్లకు పాల్పడే లుచ్చాలను తరిమితరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు.

కర్నాటక ఎన్నికల్లో భాగంగా చింతామణి అసెంబ్లీ నియోజకవర్గంలో కోలార్ ఎంపీ మునిస్వామి, బీజేపీ అభ్యర్ధి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జెనవాడె సంగప్పలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. మునిస్వామితో కలిసి ప్రచార రథమెక్కి చింతామణి వీధుల గూండా ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని అభ్యర్ధించారు. బండి సంజయ్ రాకతో చింతామణి ప్రజలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. బాణా సంచా పేల్చి, డ్యాన్సులు వేస్తూ జై బండి సంజయ్, తెలంగాణ టైగర్, కాబోయే సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. భారతమాతా కీ జై… జై శ్రీరాం అంటూ ర్యాలీ పొడువునా నినదించారు. రోడ్ షోలో అత్యధిక సంఖ్యలో యువకులే ఉండటం గమనార్హం. అనంతరం భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

చింతామణిలో యూత్ ఎక్కువ కన్పిస్తోంది. ఎండను లెక్క చేయకుండా వచ్చారంటే మీరు గ్రేట్. కోవిడ్ సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ వాళ్లు ఎవరైనా వచ్చారా? బీజేపీ అభ్యర్ధి వేణుగోపాల్ కరోనా సమయంలో మీవద్దకొచ్చి పీపీఈ కిట్లు ఇచ్చారు. 12 వేల మందికి సర్జరీలు చేశారు. రైతులకు సాయం చేశాడు. విద్యార్థులకు చదువు చెప్పించిండు.. నారాయణగురు, ముక్తేశ్వర దేవాలయమున్న పవర్ ఫుల్ ప్లేస్ చింతామణి, ఇక్కడ బీజేపీని గెలిపించాలి. మీరు వేసే ఓట్లు సరిపోవు… ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించాలి. కాంగ్రెస్, జేడీఎస్ లకు కేసీఆర్ పైసలు పంపించుండు. వాళ్లు పెద్ద ఎత్తున పంచుతూ ఓట్లను కొనాలనుకుంటోంది. బీజేపీ ప్రజలను నమ్ముకుంది.

ఇన్నేళ్లు ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఏం చేశారు? ఒక్క ఫ్యాక్టరీనైనా, పరిశ్రమైనైనా పెట్టారా? మరి ఆ పార్టీలకు ఇంకా ఎందుకు ఓటేయాలి? అందుకే మీరంతా బీజేపీకి ఓటు వేయాలి. 13న ఫలితాలను చూస్తే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల బాక్సులు బద్దలైపోవాలే. కర్నాటకలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో అభివ్రుద్ధి చేసింది. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకపోతే అభివ్రుద్ధి ఆగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కర్నాటకను ఏటీఎంలా వాడుకుంటోంది. దేశమంతా ఎన్నికల ప్రచారానికి డబ్బులు సమకూర్చుకోవడానికే కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటుంది.

కర్నాటకను ఎట్లా అభివ్రుద్ధి చేయాలనే అంశంపై కాంగ్రెస్ నేతలకు ప్లాన్ లేదు.. బీజేపీని ఓడించాలే.. కర్నాటక అభివ్రుద్ధిని ఆపాలే. నిధులు కొల్లగొట్టి దేశమంతా ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలనే యావ తప్ప కాంగ్రెస్ కు మరొకటి లేదు. చింతామణిలో కొంతమంది రెచ్చిపోతున్నరు. ఒకవర్గానికి కొమ్ముకాస్తున్నరు. చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డ గూండా నాకొడుకులను, మత చాందస వాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్లకు షెల్టర్ ఇచ్చిన వాళ్ల అంతు చూడాలా? వద్దా?

బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు.. హిందూ దేవుళ్లను అవమానిస్తే, కుల, మతాల, వర్గాల పేరుతో చీల్చితే అడ్డుకునే పార్టీ బీజేపీ. టెర్రరిస్టులకు, గూండా నా కొడుకులకు షెల్టర్ ఇస్తే ఉరికించి ఉరికించి కొట్టకుండా ఇంకా ఎందుకు మౌనం వహిస్తున్నారు? బతికినన్ని రోజులు హీరోలెక్క మాట్లాడాలే… కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్ధం కావడం లేదు. ముస్లిం మతపెద్ద ఇంటికి పోయి బొట్టు తీసేసిండు.. అట్లాంటి వాళ్లు, అట్లాంటోళ్ల పార్టీ కర్నాటక ప్రజలకు అవసరమా? అసలు బొట్టు ఎందుకు చెరిపేసుకున్నడో.. మల్లిఖార్జున ఖర్గే ప్రజలకు సమాధానం చెప్పాలే..

నరేంద్రమోదీని విష సర్పమని అంటున్నడు… సిగ్గుండాలే… ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ చిమ్మిన విషాన్ని 8 ఏళ్లుగా తన కంఠంలో ఉంచుకుని ఈ దేశ ప్రజలను కాపాడుతూ అభివ్రుద్ధి చేస్తున్న అభినవ గరళకంఠుడు నరేంద్రమోదీ. ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తే విష సర్పమా? పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తున్నందుకా? స్వచ్ఛ భారత్ పేరిట టాయిలెట్లు, మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నందుకు విష సర్పం అవుతాడా? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు జాతీయ రహదారులను అభివ్రుద్ధి చేస్తున్నందుకు, గ్రామాలకు నేరుగా నిధులిస్తూ అభివ్రుద్ధి చేసినందుకా విష సర్పమా?

ఆర్దికంగా అట్టడుగున ఉన్న భారత్ ను 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోదీదే. 2047 నాటికి భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు క్రుషి చేస్తున్న మహానేత మోదీ.చింతామణిలో పచ్చజెండాలకు స్థానం లేదు… ఈ గడ్డమీద కాషాయ జెండా రెపరెపలాడాలే. కమలం పువ్వు వికసించాలే. ఈ దేశం కోసం పనిచేసే బీజేపీని గెలిపించండి. కర్నాటక అభివ్రుద్ధికి అండగా మేముంటాం. కాంగ్రెస్, జేడీఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే వస్తున్నయ్. బీజేపీ సింహం. సింగిల్ గానే పోటీ చేస్తోంది. కర్నాటక ప్రజలు గుంట నక్కలవైపు ఉంటారా? సింహంవైపు ఉండి బీజేపీని గెలిపిస్తారా? ఆలోచించాలి. కాంగ్రెస్ గెలిస్తే పీఎఫ్ఐ పై నిషేధం ఎత్తివేస్తామంటున్నారు. ఒప్పుకుందామా? ప్రసక్తే లేదు… పీఎఫ్ఐని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిందే. చింతామణిలో వేణుగోపాల్ ను గెలిపిస్తే మళ్లీ విజయోత్సవ సభకు నేను వస్తా… మీతో చాలా విషయాలు పంచుకుంటా….

మునిస్వామి మాట్లాడుతూ…కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించింది. ఏం చేసింది? కాంగ్రెస్, జేడీఎస్ ఓకే నాణేనికి రెండు ముఖాలు.బీజేపీ అభ్యర్ధి వేణుగోపాల్ మీ బిడ్డ. మీకు సేవ చేయడానికి ఎంతో ఖర్చు పెట్టాడు. కరోనా టైంలో ఎన్నో సేవలందించాడు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు మరిన్ని సేవలందిస్తాడు… మోదీ అధికారంలోకి వచ్చాక పేదల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారు. పేదలకు రూ.5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ పేరిట ఆరోగ్య బీమాను తీసుకొచ్చారు. కూలీలు, కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. చింతామణిలో బైపాస్ రోడ్డు బీజేపీవల్లే సాధ్యమైంది. బెంగళూరు అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమైందో ఆలోచించండి.

LEAVE A RESPONSE