Suryaa.co.in

Telangana

పక్క రాష్ట్రంలో ఉన్న రజినీకి అర్థమైంది.. కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు

– దొంగ దీక్షలు చేస్తూ దొంగే దొంగ అన్నట్లు చేస్తున్నారు
– సంగారెడ్డి లో మంత్రి హరీశ్ రావు

నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ ఎంతో మారింది అని, న్యూ యార్క్ లాగా ఉంది అన్నరు. సీఎం కేసీఆర్ అభివృద్ధి బాగా చేశారు అన్నరు. 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నది. పక్క రాష్ట్రంలో ఉన్న రజినీకి అర్థమైంది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు.

కేసీఆర్ దించుతం, బి ఆర్ ఎస్ దించుతం అంటున్నరు కాంగ్రెస్ నాయకులు..ఎందుకు దించుతరు..?? ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకు దించుతరా?కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతరా?కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతరా?రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా?

రైతు బీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకు దించుతరా?కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకు దించుతరా?ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా..టీహాబ్, వీహాబ్, టీఎస్ఐపాస్ తో పదిహేడు లక్షల ప్రైవేటు కోలువులు ఇస్తున్నందుకు దించుతరా?రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం వారు చేస్తున్నారు. దొంగ దీక్షలు చేస్తూ దొంగే దొంగ అన్నట్లు చేస్తున్నారు.

LEAVE A RESPONSE