నల్లగొండలో జరిగింది కాంగ్రెస్ నిరుద్యోగ నాయకుల సభ

Spread the love

– కోమటిరెడ్డి ఓ బ్రోకర్ ..నైతికత గురించి మాట్లాడే హక్కు ఉందా?
– నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా?
– టీ ఆర్ ఎస్ కార్యాలయాలు కట్టుకుంటే తప్పేమిటి?
– కాంగ్రెస్ నేతలది జోకర్ల భాష

నల్లగొండలో కాంగ్రెస్ నిర్వహించిన సభ ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగుల సభ అని బీఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగింది. జిల్లాకు ఎవరేం చేశారో చెప్పేందుకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసింది. నల్లగొండ క్లాక్‌టవర్ వద్దకు చర్చకు వస్తారా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైది రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రవీంద్ర కుమార్ , ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సవాల్ చేశారు.

ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఏమన్నారంటే..
నల్గొండ లో కాంగ్రెస్ నిరుద్యోగ మార్చ్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. పైసలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నా అని అహంకారమో ,చంద్రబాబు ఏజంటనో అనుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు దొంగ నీతులు చెబితే నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి. తిడితే పబ్లిసిటీ వస్తుందని రేవంత్ మాట్లాడుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తుల పైన మాట్లాడారు. జగదీష్ రెడ్డి ఎపుడో సవాల్ విసిరారు..ఆస్తుల గురించి చర్చిద్దామని. నల్లగొండ లో పన్నెండు కు పన్నెండు సీట్లు గెలిచాం.జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటి రెడ్డి లను ఇప్పటికే ఎన్నికల్లో మట్టి కరిపించాం. కోమటిరెడ్డి నల్లగొండ జిల్లాకు చేసిన ఒక్క మంచి పని చెప్పగలరా? జానా రెడ్డి తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయారు. jac అంటే జానారెడ్డి యాక్షన్ కమిటీయా? కోమటి రెడ్డి తన కాంట్రాక్టు పైసల కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై ఒత్తిడి పెంచేందుకు రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్, కలెక్షన్ ల కోసమే డ్రామా లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తే నల్లగొండ ప్రజలు నాలుక కొస్తారు, బట్టలు విప్పి ఊడదీస్తారు ఓట్ల రూపం లో.జిల్లా ప్రజలు వీళ్ల చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు. రాహుల్ గాంధి కి శిక్ష పడితే నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు.

ఎంపీ లింగయ్య యాదవ్ ఏమన్నారంటే..
ఓటుకు నోటు దొంగ రేవంత్ పక్కన మా జిల్లా కాంగ్రెస్ నేతలు బాడీ గార్డుల్లా నిలబడటం సిగ్గు చేటు.కోమటిరెడ్డి బ్రదర్స్ ను నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అపుడు వైఎస్ బూట్లు నాకారు.. ఇపుడు మోడీ బూట్లు నాకుతున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి పొద్దున ఏం మాట్లాడుతారో రాత్రి ఎం మాట్లాడుతారో తెలియదు. కాంగ్రెస్ నేతల మొహాలకు ఎపుడైనా నల్లగొండ నేతలు పట్టించుకున్నారా? కాంగ్రెస్ నేతలు మోకాళ్ళ మీద నడిచినా ఆ పార్టీ కి నల్లగొండ లో డిపాజిట్లు రావు. కేసీఆర్ స్థాయి ఎక్కడ కాంగ్రెస్ నేతల స్థాయి ఎక్కడ?

ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఏమన్నారంటే..
నల్లగొండ లో జరిగింది కాంగ్రెస్ నిరుద్యోగ నాయకుల సభ. మా ఆత్మీయ సమ్మేళనం లో ఒక్క మండలానికి వచ్చిన జనం కూడా నల్లగొండ కాంగ్రెస్ సభకు రాలేదు. రేవంత్ భాష పీసీసీ అధ్యక్షుడి స్థాయి కి సరిపోతుందా? రాజకీయ విధానాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు సరికావు. రేవంత్ లాంటి వ్యక్తి కి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారో అర్థం కాదు. కాంగ్రెస్ నేతలు తమ ఇండ్లు బాగుంటే సరిపోతుంది అనుకుంటారు. టీ ఆర్ ఎస్ కార్యాలయాలు కట్టుకుంటే తప్పేమిటి? కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి అభివృద్ధి మీద మాట్లాడటానికి. దేవర కొండ లో కనీసం మంచి నీళ్ళు కూడా కాంగ్రెస్ నేతలు ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కాలి గోటి కి కూడా సరిపోరు.

ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏమన్నారంటే..
నల్లగొండ లో కాంగ్రెస్ నేతలు తమ ఉద్యోగాల కోసం సభ పెట్టుకున్నారు. నిరుద్యోగుల కోసం కాదు. ఆ సభ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. పైకి నవ్వులు లోపల కత్తులు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ నేతల తీరు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ తర్వాత అంతటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఎవరైనా phd చేయాలనుకుంటే కేసీఆర్ రాజకీయ వ్యక్తిత్వం మీద చేయాలి. పదేళ్ల కాంగ్రెస్ హాయం లో ఇచ్చిన ఉద్యోగాలు 24 వేలు మాత్రమే.దేశం లో కెల్లా అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణే.నల్లగొండ లో పన్నెండుకు పన్నెండు సీట్లు మళ్లీ గెలిచేది బీ ఆర్ ఎస్సే.. కాంగ్రెస్ కు డిపాజిట్లు రావు. కాంగ్రెస్ నేతలది జోకర్ల భాష. ఎన్నికలు వస్తున్నాయని ఇపుడు కాంగ్రెస్ నేతలు బయలు దేరారు. ఎపుడైనా ప్రజల్లో ఉండేది బీ ఆర్ ఎస్ నేతలే.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ నేతలు ఎడారి గా మార్చిన నల్గొండ జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలం చేశారు. కాంగ్రెస్ నేతలు అధికారం రాదనే వైరాగ్యంతో మాట్లాడుతున్నారు. అసహనం తో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్యే నోముల భగత్ ఏమన్నారంటే..
నల్లగొండ కాంగ్రెస్ సభ నిరుద్యోగుల కు ఏ మాత్రం ఉపయోగపడని సభ. మా పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా చెప్పాలి.తెలంగాణ లో ఇచ్చిన ఉద్యోగాల్లో కనీసం పది శాతమైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా? బూతులు మాట్లాడటానికే కాంగ్రెస్ నేతలు సభలు పెట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నల్లగొండ లో గెలిచేది బీ ఆర్ ఎస్ యే.

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏమన్నారంటే..
నల్లగొండ కాంగ్రెస్ నేతల్లో ఆరాడుగుల ఆజానుభావులు ఉండి ఆరు ఏకరాలకైనా నీళ్లిచ్చిరా?కాంగ్రెస్ నేతలు తమ ఎత్తుకు తగ్గట్టు ఫ్లోరోసిస్ ను పెంచారు తప్ప తగ్గించ లేదు. కనీసం తాగు నీళ్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఇపుడు మాట్లాడుతున్నారు. కోమటి రెడ్డి ఓ బ్రోకర్నైతికత గురించి మాట్లాడే హక్కు ఉందా? కాంగ్రెస్ లో ఉండి బీజేపీ కి మద్దతు ఇచ్చిన వ్యక్తి కోమటి రెడ్డి.. అసలు మనిషేనా? కోమటిరెడ్డి పుస్తె ఒకరికి కట్టి సంసారం మరొకరితో చేసే వాడిలా వ్యవహరిస్తున్నారు. తొక్కుతా బొంద పెడుతా అంటున్నారు.. వాళ్ళను వాళ్లే బొంద పెట్టుకుంటారు.ఊర కుక్కల్లా మొరుగుతున్నారు. మేము మాట్లాడగలం.. సంస్కారం అడ్డు వస్తుంది. బూడిదలో బొరిలే కుక్క కలలు కన్నట్టు కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు.వారివి కలలు కల్లలు కాక తప్పదు.

రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ల బతుకులు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. గోడల మీద రంగులు వేసే రేవంత్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివి? కోమటి రెడ్డి కి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి. నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా? ఎత్తు పొడవుల గురించి మాట్లాడుతున్నారు.. సూది చిన్నగానే ఉంటుంది కానీ చేసే పని కాంగ్రెస్ నేతలకు తెలియదా? ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోవాలి.

Leave a Reply