Suryaa.co.in

Telangana

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం ఖాయం !

– సోనియమ్మ రాజ్యానికి ఎదురుచూపులు
– కార్యకర్తలే మా కాంగ్రెస్ బలం
– కేసిఆర్ కు ముడు చేర్ల నీళ్ళు తాగిపిస్తాం
– టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ; సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.సీడ్లూసీ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి అని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పై, మాపై నమ్మకంతో కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను ( సీడబ్ల్యూసీ మీటింగ్ ) సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి, అగ్ర నేతలు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

60 ఏళ్ల తెలంగాణ కలను నిజం చేసిన కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా తెలంగాణకు ఎంతో ముఖ్యమైన సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశాలకు తెలంగాణను వేదికగా ఎంచుకోవడం అంటే తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవానికి నిదర్శనం అని అనుకోవాల్సి ఉంటుంది అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు సైనికుడి మాదిరిగా పని చేసి ఈ సమావేశాలను విజయవంతం చేస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి లేఖ రాయగానే వెంటనే వారు అంగీకరించడం జరిగింది. అందుకే పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ కి చెందిన వ్యక్తే. రజాకార్ల చేతిలో మల్లిఖార్జున ఖర్గే కుటుంబం చనిపోయింది. రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై సీబడ్లూసీ సమావేశాల్లో చర్చ జరుగుతుంది అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహిస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి.. సీడ్లూసీ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి సీడబ్లూసీ సమావేశాలను విజయవంతం చేస్తాం. ఇండియా కూటమి గెలవడానికి తెలంగాణలో వ్యూహం రూపొందుతోంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE