Home » కృష్ణయ్య ఏంటయ్యా నీ లీలలు

కృష్ణయ్య ఏంటయ్యా నీ లీలలు

కేవలం వెన్నదొంగే అనుకున్నాం గానీ..
మా అందరి హృదయాలు దొంగలిస్తావని అనుకోలేదు..

కురుక్షత్రంలో పాండవులను గెలిపిస్తున్నావు అనుకున్నాం గానీ…
లోకధర్మాన్ని నిలబెడుతున్నావని అనుకోలేదు..

గోపికలతో సరసాలాడుతున్నావని అనుకున్నాంగానీ..
వారి పాలిట రక్షకుడవుగా నిలుచున్నావని అనుకోలేదు..

అన్నిటినీ అనుభవిస్తున్న భోగలాలసుడవు అనుకున్నాంగానీ..
సమస్తాన్ని సమదృష్టితో చూడగల ద్రష్టుడవు అనుకోలేదు..

దేవకీ కుమారునిగా….
కుచేలుని నేస్తానివిగా…
సాందీపుని శిష్యునిగా…
అర్జుని రథసారధిగా….

పోషించిన ప్రతి పాత్ర..
సర్వమానవాళికి జీవిత పాఠం..
ఆనందానికి అసలు చిరునామా..
అంతర ప్రయాణానికి నీవే మా ధీమా..

నీవు చేబూనిన శూన్యాన్ని కలిగిన పిల్లనగ్రోవి చెబుతోంది..
శూన్యమై సర్వంలో ఐక్యమైపోమని..

గీతను ప్రభోదించి..
మా రాతలు మార్చుకొనుటకు అవకాశమిచ్చిన గోవిందుడా..
నీకు ఇవే మా..నిత్య మంగళ హారతులు..

హ్యాపీ బర్త్డే కృష్ణ…,
తీర్చాలి జన్మజన్మల నుండి కొనసాగుతున్న తృష్ణ (మోక్షం )..,

నువ్వు తీరుస్తావు..
ఎందుకంటే కోరేది నీ కొనసాగింపు జీవకణాలే..

Leave a Reply