Suryaa.co.in

Andhra Pradesh Telangana

సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంలో కుట్ర కోణం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి TS జక్కలి ఐలయ్య యాదవ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మళ్లీ కొనసాగాలని ఏపీ సీఎం ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడంలో కుట్ర కోణం దాగి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలకు వస్తున్న భారీ ప్రజా స్పందన చూసి తట్టకోలేక.. ప్రజల దృష్టి మళ్లించేందుకు మరలించేందుకు వైసిపి ప్రయత్నం చేస్తుంది. మూడు సంవత్సరాల వైసిపి పాలనలో అక్కడ ప్రజలు సీఎం జగన్ పై తీవ్రమైన వ్యతిరేకతో ఉన్నారు.

దాడులు దౌర్జన్యాలు ప్రజల ఆస్తులను లుటీలు చేసినా.. భయభ్రాంతులకు ప్రజలను గురి చేస్తునా… చంద్రబాబు నాయుడు పెట్టిన సభలకు స్వచ్ఛందంగా లక్షల మంది తరలి వస్తున్నారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనే ప్రజల బలమైన కోరిక స్పష్టంగా కనపడుతున్నాడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వైసీపీ మోసపు మాటలతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఆంధ్రలో సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్న టిఆర్ఎస్. వైసీపీ పార్టీల మాటలకు కాలం కాలం చెల్లింది..

LEAVE A RESPONSE