– వైసీపీ విధానాన్ని ఎందుకు అమలుచేశారు?
– ఆన్లైన్లో ఇస్తే ఈ విషాదం జరిగేది కాదు కదా?
గతంలో ఏ ప్రభుత్వమైనా ఏకాదశి ద్వాదశి రెండు రోజులే దర్శనాలు ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారం కోసం, ఓట్ల కోసం తిరుపతిలో కౌంటర్లు పెట్టి, రెండు రోజులు ప్రాధాన్యత కలిగిన దర్శనాన్ని.. అనవసరంగా తొమ్మిది రోజులు పెంచి క్యూ లైన్లు ఏర్పాటు చేసి, టోకెన్ సిస్టం పెట్టారు. ఇది పూర్తిగా ఆగమ వైశాఖ శాస్త్రాలకు విరుద్ధం వారి గవర్నమెంట్ లో చేసిన విధానాన్ని మనం ఎందుకు అమలు చేయాలి?
ఇప్పుడు మనము చేసిన ఈ కౌంటర్ విధానంలో గతంలో అనుభవం ఉన్న ఈ వైసిపి బ్యాచ్ కి, విశాఖపట్నం ఎన్డీఏ కార్యక్రమం జయప్రదం కావడం హైలైట్ కావడం వాళ్లకి ఇష్టం లేదు. కాబట్టి రాజకీయ కుట్ర ఏమైనా చేసే వీళ్ళ అరాచకాలు గతంలో మనం చూసాం. ఉదాహరణ తుని ఘటన, కోస్తా అల్లర్లు, వైజాగ్ మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలు,ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు పరచి ఆన్లైన్లో ద్వారానే….. పాత పద్ధతిని తీసుకురావాలి
కానీ ఇప్పుడు దుర్ఘటన జరిగిన ఏరియాలో ఆ స్కూలు ఒక మాస్ ఏరియాలో ఉంటుంది. రామానాయుడు స్కూల్ దానికి అనుకొని ఒక మున్సిపల్ పార్కు ఉంది. అప్పుడు గాంజా బ్యాచ్, మందుబాబులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు .సో రాత్రి 9:00 ప్రాంతం కాబట్టి.. కొంత వారి ఇన్వాల్వ్మెంట్, మాస్కులు వేసుకొని మంకీ క్యాప్ లో పెట్టుకొని కొంతమంది వచ్చారు గేట్లు తోశారు. పైనుంచి దూకారు అనే వాధను కూడా వినపడుతుంది. కాబట్టి ఇందులో రాజకీయ కుట్ర కోణం దాగుందా?
ఈ విషయం జెఈఓ కి, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేద్దాం. కానీ ఆధునిక టెక్నాలజీ వాడుకొని ఆన్లైన్ ద్వారానే పాత పద్ధతి ప్రకారం ఏకాదశి, ద్వాదశి మాత్రమే దర్శనాలు కల్పించే విధంగా.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలి.
“పైగా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో తిరుమల యంత్రాంగానికి మంచి పట్టు ఉంది లక్షల మంది చక్రస్నానికి,గరుడ వాహనానికి వచ్చిన ఏ ఇబ్బంది కలగలేదు, తిరుపతిలో ఒక మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంటే కచ్చితంగా ఇందులో ఏదో కుట్ర దాగుందని అనుమానం.
– ఆర్ఎన్కే