-విజయశాంతి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని, దీని వెనక టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ‘‘తెలంగాణలో కేసీఆర్ సర్కార్ విధ్వంసాల పేరుతో రాజకీయం చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన దురదృష్టకరం. ఆర్మీ విద్యార్థులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదు. టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది. ఆర్మీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదు. ప్రధాని మోదీ అలాంటి వ్యక్తి కాదు. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలు వినొద్దని బీజేపీ తరుపున విజ్ణప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయి. ప్రభుత్వమే విధ్వంసాలను పెంచి పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనే లక్ష్యంతోనే కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తుంది. హైదరాబాద్లో బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. వాటి దృష్టి మరల్చేందుకే ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. కేసీఆర్ ఈ విధ్వంస రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజానీకమే నీ సర్కార్ను బొంద పెట్టడం ఖాయం. ’’ అని విజయశాంతి హెచ్చరించారు.