-అవినీతిపై యుద్ధం కోసమే కాల్ 14400
-పార్లమెంట్ స్థంబింపజేస్తున్న కాంగ్రెస్ తీరు సరికాదు
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ఏపీ అప్పులపై విపక్షాలు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని, పార్లమెంట్ సాక్షిగా పచ్చ కుట్ర బయటపడిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ట్విట్టర్ వేదికగా మంగళవారం ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పుల్లో ఆంధ్రాది అగ్రస్థానమని పచ్చ కుల మీడియా విష ప్రచారం కేంద్ర ప్రభుత్వ సమాధానంతో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమయ్యిందని అన్నారు. చంద్రబాబు, అతని పచ్చపార్టీ ఇకపై శ్రీలంకలో రాజకీయం చేసుకోవాలని ఏద్దేవా చేసారు.
‘గడప గడపకు కార్యక్రమంలో బాగంగా ఎక్కడో ఒకరు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే పచ్చకుల మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. సీఎంగా ఉండగా స్వయంగా చంద్రబాబునే జనం నిలదీశారు. ఏమీ చెప్పలేక ఏయ్ తోకలు కత్తిరిస్తా, నోర్ముయ్, ఉద్యోగం పీకేస్తా, ఎవడ్రా నువ్వంటూ పరుషపదజాలంతో దబాయించిన విషయాన్ని గుర్తుచేశారు.
అవినీతిపై బ్రహ్మాస్త్రం సంధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాల్ 14400 ప్రజలు ఉపయోగించుకోవాలని, అవినీతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు గత పది రోజులుగా పార్లమెంటును సాగనివ్వకుండా స్థంబింపజేయడం సరికాదని, రోడ్లపై ఆందోళనలు చేపడుతూ, ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. పార్లమెంటును సాఫీగా సాగేలా సహకరించాలని అన్నారు. పోలవరంలో కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టిన బాబు కమీషన్ల కక్కుర్తి గురించి.టన్నుల కొద్దీ స్టీల్ ద్విచక్ర వాహనాలపై పోలవరానికి తరలించడం గురించి పచ్చమీడియా మాట్లాడలేదని, చంద్రబాబు అవినీతిలో బాగస్వాములు కావడమే దీనికి కారణమని అన్నారు.