– 80 వేల నుంచి లక్షలమంది వరకూ ప్రజలు వస్తే 50మంది పోలీసులు కూడా భద్రతకు లేరు
-ఇల్లే దాటని ముఖ్యమంత్రికి మాత్రం 2 వేల పోలీసులు భద్రత
– ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఎందుకివ్వరు?
– ఆ కేసులు పెట్టాల్సింది ముఖ్యమంత్రిపైన
– ప్రజలను ఎలా భయపెట్టాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట ఘటన బాధాకరం. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కందుకూరు , గుంటూరులో జరిగిన ఘటనలను చూస్తే బాధతో పాటు భయం కూడా వేస్తోంది. వరుస ఘటనలు జరిగినా ప్రభుత్వం ఎందుకు సరిగా స్పందించడం లేదో అర్ధం కావడంలేదు. ఘటన జరిగిన వెంటనే మంత్రులందరూ చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేయడం దేనికి సంకేతం? చంద్రబాబు సభలకు అశేషంగా తరలివస్తున్న జనాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఇవన్నీ చంద్రబాబు చేసినట్టుగా చూపించి ఆయన సభలను బ్యాన్ చేయాలని కుట్ర జరుగుతోంది. 80 వేల నుంచి లక్షలమంది వరకూ ప్రజలు వస్తే 50మంది పోలీసులు కూడా భద్రతకు లేరు. ఇల్లే దాటని ముఖ్యమంత్రికి మాత్రం 2 వేల పోలీసులు భద్రతగా ఉన్నారు.
ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఎందుకివ్వరు? గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమ నిర్వహణకు ముందుగానే ఉయ్యూరు శ్రీనివాసరావు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. ఎంతమంది జనం వస్తారో కూడా ముందే చెప్పారు. చంద్రబాబు గారు వస్తారని పోలీసులకు, ఇంటెలిజెన్స్ కు ముందే తెలుసు. అయినప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఘటన జరిగాక బయటకు వచ్చి హడావుడి చేశారు. చంద్రబాబు , కార్యక్రమ నిర్వాహకులపై 304,144 సెక్షన్ల కింద కేసులు పెడతామన్నారు. ఆ కేసులు పెట్టాల్సింది ముఖ్యమంత్రిపైన. తొక్కిసలాటలో ముగ్గురు చనిపోగానే సానుభూతి చెప్పాల్సిందిపోయి వైసీపీ నేతు రాజకీయం చేస్తున్నారు. ఘటన జరిగిన గంటలోగా ఐదుగురు మంత్రులు మాట్లాడారు. సానుభూతి చెప్పడాన్ని మేము తప్పు పట్టము. కానీ ముందే స్కెచ్ వేసుకున్నట్టు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం, వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ అవడం, జాతీయ మీడియాను అలర్ట్ చేయడం జరిగిపోయాయి.
చంద్రబాబు సభలను బ్యాన్ చేయాలని వారంతా ఒకే మాట మాట్లాడుతున్నారు. దీని వెనుక కుట్ర ఉంది. ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చంద్రబాబు గారి సభలు జరగకూడదని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు సభలపై ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే తొక్కిసలాటలు జరిపి ప్రజల ప్రాణాలు తీస్తున్నట్టున్నారు. ఎందుకంటే సీఎం జగన్ సైకోయిజం మనం చూస్తున్నాం. తల్లిని, చెల్లిని ఎలా వాడాలో, బాబాయ్ ని ఎలా లేపేయాలో, ప్రజలను ఎలా భయపెట్టాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గుంటూరు ఘటనకు పోలీసులదే బాధ్యత. మహానాడు సహో ఎన్నో కార్యక్రమాలకు లక్షలాది ప్రజలు తరలివచ్చినా ఒక్క అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్షనేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు ముందుకొచ్చి బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పటికైనా అధికార వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి.