Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు:మనోహర్‌

ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలు రాకపోవడంతో డిగ్రీలు చదివిన యువత వలస బాట పడుతున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు. ప్రతి ఏడాది 45 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి రెండున్నరేళ్ల తర్వాత 450 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంతో దుర్మార్గమైన పాలన జరుగుతోంది. కేవలం పాలకులు, వారి కింద పని చేసే నాయకులు కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదుగుతుందనే భయంతో పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నాయకులు, కార్యకర్తలతో అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా సలహాదారులు ఒత్తిడి చేయడంతోనే మనపై కేసులు పెడుతున్నారు. రాజమండ్రి సభను కూడా ఇబ్బందిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే మన జనసైనికులు పోలీసుల దిగ్భందాన్ని దాటుకొని పొలాలు, బురద నుంచి సభ ప్రాంగణానికి చేరుకొని సభను విజయవంతం చేశారు.
 సమస్య గురించి చెప్పినా కేసులే
క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. కిందస్థాయి కమిటీలు డిసెంబర్ 31 కల్లా పూర్తవుతాయి. ప్రకాశం జిల్లాకు కొత్త కమిటీ వచ్చింది. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం కల్పిస్తూ కమిటీ నిర్మాణం జరిగింది. గంట వ్యవధిలోనే ఈ కమిటీకి పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర వేశారు. సోషల్ మీడియాను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించండి. వ్యక్తిగత విమర్శలకు ఉపయోగించొద్దు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోంది. పాలన బాగోలేదన్నా కేసులు పెడతారు. సమస్య గురించి చెప్పిన అరెస్టు చేస్తారు. దొంగను దొంగా అనలేని పరిస్థితి నెలకొందని” అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎగిరేది జనసేన జెండానే
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ “రాష్ట్రంలో అప్రకటిత రాచరికం నడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టించాల్సిన అవసరం అసన్నమైంది. ప్రజల్లో జనసేన పార్టీ మద్దతు, ఆదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ నాయకులు మన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కేసులు, దాడులకు భయపడాల్సిన అవసరం లేదు. 2024లో రాష్ట్రంలో జనసేన జెండా ఎగరడం ఖాయం. నియోజకవర్గాల్లో నిలబడిన ప్రతి అభ్యర్ధిని పవన్ కళ్యాణ్ గారిలా భావించి వారిని గెలిపించాలని” కోరారు.
జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో నిజాయితీగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి ఏ నాయకుడికి లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ అని అన్నారు.. ప్రకాశం జిల్లా చాలా వెనకబడిన జిల్లా. ఇక్కడి నుంచి గెలిచిన నాయకులు.. వారి ఆస్తుల అభివృద్ధి చేసుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి మరిచిపోయారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచి సీఎం అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేలా నాదెండ్ల మనోహర్ ఆయన్ను ఒప్పించాలని” కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. పాకనాటి గౌతంరాజ్, పార్టీ నాయకులు బెల్లంకొండ సాయిబాబా, కంచర్ల శ్రీకృష్ణ, పులి మల్లికార్జున్, మలగ రమేష్, కందుకూరి బాబు, సుంకర సాయిబాబాలతోపాటూ జిల్లా కార్యవర్గ సభ్యులు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE