హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై నిన్న మాదాపూర్ కి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోజు ఉదయం బాధితులను పరామర్శ కి వెళ్లిన సనత్ నగర్ మాజీ శాసనసభ్యురాలు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన తో బాధితులు తమ ఆవేదన తెలిపారు.
గత కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన తో మొరపెట్టుకున్నారు.. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి యువకుడైనా భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల
అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం చూసి హృదయం చలించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. నగర నడిబొడ్డున ఉన్న లంగర్‌హౌజ్, మాదాపూర్ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావడంతో 200 మందికి పైగా అస్వస్థతకు గురవయ్యారు అంటే నగర పాలక సంస్థ పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతుంది.
అలాగే విశ్వ నగరం గా హైదరాబాద్ ని తీర్చిదిద్దుతా అంటూ కేసీఆర్ మీడియా ముందు ప్రగల్భాలు పలకడం మాని ప్రజల కనీస అవసరాలు అందుబాటులో తేవాలని డిమాండ్ చేస్తున్న ..లంగర్‌హౌజ్ పరిధిలోని మూడు కాలనీల్లో ఇంటికొకరు చొప్పున బాధితులున్నారు. బాధితులందరికీ వాంతులు,
విరేచనాలు అవుతుండడంతో స్థానిక మెడికల్ షాపులు, ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు.. వైద్య శాఖ కూడా తక్షణమే అందుబాటులో తెచ్చి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వాటర్‌వర్క్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బీమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాట్రగడ్డ ప్రసూన పరామర్శించారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చింది – కాట్రగడ్డ ప్రసూన
కొద్దిరోజులుగా తాగునీరు మురుగు వాసన వస్తోందని పలుమార్లు వాటర్ వర్క్స్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు కాట్రగడ్డ ప్రసూన తో తమ ఆవేదన తెలిపారు.అధికారులు వారి నిర్లక్ష్యం వల్లే గుట్టలబేగంపేటలో ఓ వ్యక్తి ప్రాణం పోవడంతో పాటు 20 మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని కాట్రగడ్డ ప్రసున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్తీ నీరు త్రాగి మరణించిన భీమయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత,మహేష్,శ్రీనివాస్ రెడ్డి,వాహిద్, అశోక్, మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు