– ఆయన క్రైస్తవులకు చేసిందేమీ లేదు
– ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఫైర్
ఏపీ క్రిస్టియన్ జేఏసీ మరోసారి సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. ‘‘క్త్రైస్తవ పరిరక్షణ, సంక్షేమానికి ఏపీలో చాలామంది నేతలున్నారు. అనిల్ అవసరం ఇక్కడేమీ అవసరం లేదు. ఏమన్నా ఉంటే తెలంగాణలో చూసుకుంటే మంచిది. అసలాయన క్రైస్తవులకు చేసిన మేలు ఏమీ లేదని’ స్పష్టం చేసింది. కొంతమంది క్రైస్తవ నాయకులు క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్నారంటూ ప్రత్యక్షంగా-పరోక్షంగా బ్రదర్ అనిల్‌పై జేఏసీ విమర్శనాస్త్రాలు సంధించింది. విశాఖలో క్రైస్తవ జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రదర్ అనిల్ లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం ,విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాలకు కార్యవర్గాన్ని నియమించడం జరిగింది.
జేఏసీ చైర్మన్ యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ.. కొంతమంది క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజంలో అనేక మంది క్రైస్తవ నాయకులు ఉన్నారని , అనిల్ బ్రదర్ కి ఈ ఆంధ్ర రాష్ట్రం లో క్రైస్తవుల్ని ఉద్ధరించాల్సిన పని లేదని అన్నారు . అనిల్ బ్రదర్ క్రైస్తవ సమాజానికి చేసిన సేవ ఏమీ లేదని అన్నారు. ఆయన ఎప్పుడు క్రైస్తవుల బాగోగుల పట్టించుకునే వారు కాదని అన్నారు. ఏమన్నా ఉంటే తెలంగాణలో చేసుకుంటే మంచిదని మండిపడ్డారు. ఈ పాలనలో ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవులందరూ క్షేమంగా ఉన్నారని, సంక్షేమ కార్యక్రమాలలో ఒడిదుడుకుల్ని ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేదర సురేష్ ,కుమార్ బిషప్ ,ఎద్దుల బాలరాజు, పి బిషప్ జె జార్జ్ బిషప్ పిజే కెనడా విష బీన్ నవీన్ కుమార్ బిషప్ సామిల్ పా బిషప్ ఫ్యామిలీ పిండి సలోమి యోగ యేసు రత్నం ,యార్లగడ్డ చాలిస్ ఆహరోన్ వార్తా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.