Suryaa.co.in

Andhra Pradesh

కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు 5, 6 నెలలు కూడా జీతాలివ్వటంలేదు

– అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తానన్నవ్యక్తి, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా వారిముఖం చూడటానికి కూడా ఇష్టపడటంలేదు.
• కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటాడు.
– టీడీపీ రాష్ట్ర హెచ్ ఆర్ డీ విభాగం సభ్యులు రాంగోపాల్ రెడ్డి

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలోచెప్పినవి, ప్రజలకుఇచ్చిన హామీలను నిలబెట్టు కోవాలని, అవిఅమలుచేయకపోతే వెంటనే రాజీనామాచేయాలని ప్రగల్భాలుపలికిన జగన్మోహన్ రెడ్డి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగులజీవితాలతో ఆడుకుంటున్నాడని, అధికారంలోకివచ్చిన వెంటనేవారిని రెగ్యులరైజ్ చేస్తానన్న జగన్ రెడ్డి, ఇప్పుడు కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ సిబ్బందికి 5, 6నెలలకు కూడాజీతాలు ఇవ్వడంలేదని టీడీపీ రాష్ట్ర హెచ్ఆర్ డీ సభ్యులు రాంగోపాల్ రెడ్డి ఆరోపిం చారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగుల వ్యతిరేకప్రభుత్వమని తేలిపోయింది. పాదయాత్రసమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడంతోపాటు, సమానపనికి సమానవేతనం ఇస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చాడు.

అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా జగన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయలేదు సరికదా.. కనీసం వారిముఖంచూడటానికి కూడా ఆయన ఇష్టపడటంలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించి, ముఖ్యమంత్రి హోదాలో ఆయన జూలై 19, 2019న 6గురు మంత్రులతో వేసిన కమిటీ, అధికారులు కమిటీల నివేదికల్ని అమలు చేయకుండా బుట్టదాఖలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దిశగా ప్రభుత్వం ఎలాంటిఆలోచన చేయడంలేదు. ప్రభుత్వ సంస్థల్లో 64వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులుంటే, వారిజీవితాలతో ముఖ్యమంత్రి ఆడుకోవడం దుర్మార్గం.

కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు 5, 6 నెలలకు కూడా ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ సిబ్బందితో మాట్లాడటానికి కూడా ఈప్రభుత్వం ఇష్టపడకపోవడం దుర్మార్గం. జగన్ ప్రభుత్వం నెలనెలా జీతమిస్తే చాలనే దుస్థితికి కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ సిబ్బంది వచ్చారు. ప్రభుత్వసలహాదారులకు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతరత్రా అధికారపార్టీ, ప్రభుత్వవిభాగాలవారికి ఠంఛన్ గా జీతాలిస్తున్న ముఖ్యమంత్రి, విద్యాసంస్థలు ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్ట్ సిబ్బందికి ఎందుకు సక్రమంగా ఇవ్వడంలేదు?

ఐఐఐటీ విద్యా సంస్థల్లో కొన్నివందలమంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు, వారికి గురుకులపాఠ శాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేసేవారికి ఇస్తున్నజీతంతోపోలిస్తే చాలాతక్కువ ఇస్తు న్నారు. ఐఐఐటీ విద్యాసంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలు కూడా గురుకుల, ప్రభుత్వజూనియర్ కళాశాలల్లోపనిచేసేవారితోసమానంగా ఇవ్వాలి.

టీడీపీ హాయాంలో ప్రతికాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగికి సక్రమంగా ప్రతినెలా1వతేదీనే జీతాలం దాయి. ఆనాడు ఉద్యోగసంఘాలనేతలు అడిగిన వెంటనే కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా నెలానెలా సక్రమంగాజీతాలు అందించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదేశించారు.

జగన్ రెడ్డి కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగులపై వివక్షచూపకుండా, ఎన్నికలసమయంలో ఇచ్చినహామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగులకున్యాయం చేయకుంటే, వారుచేసే న్యాయమైన పోరాటానికి టీడీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నాం.

LEAVE A RESPONSE