మతం మారిన వారికి ఎస్.సీ. స్థితి ఉండదు; హిందూ మతంలోని వారికి మాత్రమే ఎస్.సీ. స్థితి, ఇతర చట్టపరమైన హక్కులు వర్తిస్తాయని సుప్రీమ్ కోర్ట్ స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ఈ సుప్రీమ్ కోర్ట్ తీర్పు పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది. ఇందులో న్యాయమూర్తుల ఇంటర్ ప్రెటేషన్ లేదు.
రాజ్యాంగం ఆర్టికల్ 341 ఎవరు ఎస్.సీ.లు అన్నదానిని నిక్కచ్చిగా తెలియజేసింది. ఈ ఆర్టికల్ పూర్తిగా అంబేడ్కర్ రూపకల్పన. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ బీ.ఎన్. రావ్, మున్షీ, అల్లాడి వంటి వారి మేధతో రూపొందాయి. కానీ ఈ ఆర్టికల్ 341 పూర్తిగా అంబేడ్కర్ రూపకల్పనే.
ఎవరు ఎస్.సీ.లు? రాజ్యాంగం ఇలా తెలియజేస్తోంది:
“As per the constitution Scheduled Castes order 1950, only individuals practising Hinduism, Sikhism, Buddhism considered members of Scheduled Castes”
‘హిందూమతాన్ని అవలంబిస్తున్న వాళ్లు మాత్రమే ఎస్.సీ.లుగా పరిగణించబడతారు’ అని రాజ్యాంగం ఘంటాపథంగా తెలియజెప్పింది.
తొలుత అంబేడ్కర్ ఈ ఎస్.సీ.లు అన్నదాన్ని హిందూమతస్థులకు మాత్రమే అని నిర్ణయించి, నిర్దేశించారు. అటు తరువాత 1956లో సిక్కులను కలిపారు. ఈ కలపడం అంబేడ్కర్ ఆలోచనేనా? తెలియడం లేదు.
1990లో బౌద్ధులను కలిపారు. ఎస్.సీ.లలో బౌద్ధులను కలపడం అంబేడ్కర్ బుద్ధికి, మాటకు విరుద్ధం అని మనం నిర్ద్వంద్వంగా తెలుసుకోవచ్చు.
సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మతం మారిన వాళ్లను ఎస్.సీ.లుగా పరిగణించాలని ఆగం చెయ్యడం అంబేడ్కర్ బుద్ధికి, మాటకు విరుద్ధం. అంబేడ్కర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా, అంబేడ్కర్ ను తృణీకరిస్తూ మతం మారిన వాళ్లను ఎస్.సీ.లుగా పరిగణించాలనడం దుష్టవాదం; వక్రవాదం; రాజ్యాంగం వ్యతిరేకం; దేశ ద్రోహం.
లోపాయికారీ లబ్ది కోసం మత మిషనరీల తొత్తులై కొందురు దేశంలో ఈ విషయంగా అసంస్కారంతో ఆగం చేస్తున్నారు.
అంబేడ్కర్ రాసిన ఆర్టికల్ 341లో బౌద్ధులకు ఎస్.సీ. స్థితి లేదు. 1990లో బౌద్ధులకు ఎస్.సీ.స్థితి కలిగించి అంబేడ్కర్ హృదయానికి తూట్లు పొడవడం జరిగింది. దేశంలో అంబేడ్కరుకు ద్రోహం జరుగుతోంది. అంబేడ్కర్ మాటను అనుసరించి బౌద్ధులకు కూడా ఎస్.సీ. స్థితిని తొలగించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందా? ఆలోచన చెయ్యాలి. ఈ విషయంగా సుప్రీమ్ కోర్ట్ మరో సరైన నిర్ణయం చెయ్యాలి.
అంబేడ్కర్ బుద్ధికి, మాటకు విరుద్ధంగా దేశానికి హాని చేస్తున్న దుష్ట, మతవాద శక్తుల నిర్మూలన జరగాలి.
– రోచిష్మాన్
9444012279
(ఈ వ్యాసంలో ఉటంకించబడిన విషయాలు అంతర్జాలం ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చు)