Suryaa.co.in

Andhra Pradesh

ముస్లిం సంచార జాతుల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– 21 వ తేదీన జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానం
గుడివాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో వెనుకబడిన ముస్లిం సంచార జాతుల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంచార జాతుల వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 వ తేదీ సాయంత్రం 3 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ జీవనం సాగిస్తున్న ముస్లిం సంచార జాతుల అభ్యున్నతికి సీఎం జగన్మోహనరెడ్డి ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్పోరేషన్ కు చైర్మన్ , 12 మంది డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. ముస్లిం సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కార్పోరేషన్ ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. అందరికీ విద్య, వైద్యం అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టారన్నారు. ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నారన్నారు. వృత్తిపరంగా కూడా సాయం చేయడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE