– మంత్రి సంధ్యారాణికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి
న్యూఢిల్లీ: ఆంధ్రరాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఏపీ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సంధ్యారాణి గురువారం అన్నపూర్ణ దేవిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారితో కలిసి ఢిల్లీలో వారి ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 పథకం కింది అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సహకారాలు అందించాల్సి సంధ్యారాణి కేంద్ర మంత్రిని కోరారు. భారత ప్రభుత్వం ద్వారా 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం – జన్ మన్) కింద అంగన్వాడీలకు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం 20 కోట్లు భారత ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
డబుల్ పోర్టల్ లో ఫేషియల్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ ను ఒక పోర్టల్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ చేస్తే ఉద్యోగులకు పనిభారం తగ్గుతుందని సూచిస్తే దానికీ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. బాలామృతం కోసం ఈ సంవత్సరం నుండి ఆంధ్రలో ఏపీ ఫుడ్ పరిశ్రమ పెట్టి మనమే తయారుచేసుకుంటే బాగుంటుందని, దానికి 80 కోట్లు అంచనా ఉందని కోరగా, దానికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
కేంద్ర మంత్రికి అరకు కాఫీని ఇవ్వగా… ముచ్చట పడి తీసుకున్నారని సంధ్యారాణి మీడియాకు తెలిపారు. ఎంతో అభిమానంతో మాట్లాడి, నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవికి ఈ సందర్భంగా సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు.