Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డికి వట్టి నాగులపల్లిలో అక్రమ ఫార్మ్ హౌజ్

– దుర్గం చెరువు పరిధిలో ఉన్న సీఎం సోదరుడి ఇల్లు ఉంది
– ముందు అది కూల్చండి
– రేవంత్ నియోజక వర్గం లోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లేక మూత
– రేవంత్ రెడ్డి రాష్ట్రం లో డైవెర్ష న్ పాలిటిక్స్
– బీఆర్ఎస్ నేతలు డాక్టర్ కె .వాసుదేవ రెడ్డి ,డాక్టర్ బాలరాజు యాదవ్ , మహేష్ రెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం లో డైవెర్ష న్ పాలిటిక్స్ చేస్తున్నారని సామాన్య జనం చర్చించుకుంటున్నారు.హైడ్రా కు సంబంధిన వార్తలే పతాక శీర్షిక న ఉంటున్నాయి. హైడ్రా కు మేము వ్యతిరేకం కాదు. మిగతా విషయాలు కూడా సీఎం పట్టించుకోవాలి. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేసీఆర్ హాయం లో గురుకులాల సంఖ్య వెయ్యి దాటింది.

రేవంత్ సర్కార్ ప్రభుత్వ గురుకుల వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తోంది. 38 మంది విద్యార్థులు గురుకులాల్లో ఇప్పటివరకు వివిధ కారణాలతో చనిపోయారు ..అయినా గురుకులాల్లో పరిస్థితులు మారడం లేదు. సీఎం ,మంత్రులకు చీమ కుట్టినట్టయినా లేదు ..ఇంకా వారు మొద్దు నిద్రలోనే ఉన్నారు. చాలా రోజుల నుంచి మేము గురుకులాల స్థితిగతుల గురించి హెచ్చరిస్తూనే ఉన్నాం. తాజాగా గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కరిచాయి.

ఇలా ఎంత కాలం విద్యార్గులు భాధ పడాలి ? కేసీఆర్ హయాంలో ప్రతి గురుకుల విద్యార్ధి పై లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశారు. రేవంత్ సర్కార్ లో సీన్ రివర్స్ అయింది. సీఎం రేవంత్ నియోజక వర్గం లోనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లేక మూతపడింది ..ఇంత కన్నా దారుణం ఉంటుందా ?

ప్రజా పాలన పడకేసింది. విద్యా శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారు. ఆయన బిజీ గా ఉంటే వేరొక్కరికి విద్యా శాఖ భాద్యతలు అప్పగించాలి. గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రుష్టి సారించాలి.

డాక్టర్ బాలరాజు యాదవ్
సీఎం రేవంత్ గురుకులాల వ్యవస్థ ను చిన్నాభిన్నం చేస్తున్నారు. కేసీఆర్ హాయం లో కేసీఆర్ గురుకులాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా అద్వాన్నంగా తయారు అయ్యాయి. విద్య , వైద్యం పక్కన బెట్టి రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన తెచ్చారు. ప్రియాంక గాంధీ యూపీ లో బుల్డోజర్ పాలన ను వ్యతిరేకిస్తున్నారు.ఇక్కడ సమర్థిస్తారా ?

దుర్గం చెరువు పరిధిలో ఉన్న సీఎం సోదరుడి ఇల్లు ఉంది .అన్ని ఆధారాలు ఉన్నాయి. ముందు అది కూల్చండి. రేవంత్ రెడ్డి కి వట్టి నాగుల పల్లి లో అక్రమ ఫార్మ్ హౌజ్ ఉంది ముందు అది కూల్చండి.
..బుల్డోజర్ ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాల మీదకు వెళ్ళాలి
..హైడ్రా పేరుతో హర్యానా ,కాశ్మీర్ ,మహారాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ నిధుల కోసం దాడులు జరిగుతున్నాయ్.
..మా ఎమ్మెల్యేల పైనే రాజకీయ దురుద్దేశం తో దాడులు జరుగుతున్నాయి.
..హైడ్రా పేరిట కాంగ్రెస్ కు ఫండ్ రేజింగ్ జరుగుతోంది.
..హైడ్రా దాడులు చేస్తే రుణ మాఫీ జరుగుతుందా ?
..మంత్రి సొంత ఊళ్ళో కూడా రుణ మాఫీ కాలేదు.
..రాష్ట్రానికి శనిలా రేవంత్ పాలన.
…ముందు ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించండి.
..రుణ మాఫీ చేయని రేవంత్ కు హరీష్ రావు రాజీనామా కోరే హక్కు ఎక్కడిది?

LEAVE A RESPONSE