Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ధిక్కరణ కింద ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష

అమరావతి : కోర్టు ధిక్కరణ కింద ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి అనే ఇద్దరుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో, పూనం మాలకొండయ్యకు నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. తమను రెగ్యులరైజ్ చేయాలని సెరికల్చర్ ఉద్యోగులు గతంలో కోర్టుకు వెళ్లారు. దీంతో వారిని రెగ్యులరైజ్ చేయాలని, గత ఏడాది ఫిబ్రవరి 28న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్డు ఆర్డర్‌ను అధికారులు సకాలంలో అమలు చేయలేదు. దీంతో ఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది. అయితే ఎంత కాలం శిఖ విధిస్తారు అనే అంశంపై ఈ నెల 29న ఖరారు చేయనుంది. మరోవైపు ఈ అంశంపై అధికారుల్లో వివిధ రకాలుగా చర్చ జరుగుతోంది.

LEAVE A RESPONSE