– విద్య పై ఖర్చు దేశ భవిష్యత్తు కు పెట్టుబడి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి పునరుద్ఘాటించారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో అత్యున్నత విద్యను అందించాలని ప్రజాప్రభుత్వం లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు.
ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ భవన నమూనాలను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతేకాక ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అనుగుణంగా స్థల సేకరణ అంశంపై అధికారులను ఆరా తీశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షిల్ స్కూల్స్ ద్వారా రాష్ట్రంలోని దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలతో పాటు.. ప్రతి పేద విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేవలం విద్యతోనే జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. విద్యపై పెట్టే ఖర్చు.. రాష్ట్ర, దేశ భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిగా భావించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్రా వెంకటేశం, ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ శరత్, గురుకులం సెక్రెటరి సైదులు, సీతాలక్షి ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు.