ఎన్నో ఆశలను
ఎన్నో ఆశయాలను
బ్రతికించే
నల్లరేగడి తెల్లబంగారమా
నిన్నే నమ్ముకున్న నీ తండ్రి రైతన్న బ్రతుకు విలువ పెంచు.
సాలు సాలుకో గింజై
నూలుపోగుకో దారమై
దేహపు మానమును కప్పిపుచ్చే కల్మషంలేని తెల్లబంగారమా
నిన్నే నమ్ముకుని కష్టపడుతున్న మట్టిమనిషి మర్యాద పెంచు.
రైతన్న చెమటచుక్కను తాగి
కర్షకుడి కష్టపు నెత్తురును తాగి
రెండు ఆకులతో ఊగి
రెక్కల కష్టానికి ఖరీదు కట్టే పత్తి….
నువ్వుకాకు రైతు ప్రాణం తీసే మెత్తటి కత్తి.
ఖద్దరుకైనా
కరెన్సీ కైనా
భగవంతుడి పూజ దీపానికైనా
మూలాధారమైన ప్రత్తి
నీ మనుగడ కొనసాగని కలకాలం.
– అభిరామ్