-అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి
-కౌంటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు
ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు కౌంటింగ్‌పై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ విజయవంతంగా జరిగేందుకు అవసరమైన ముం దస్తు ఏర్పాట్లను ఇప్పటినుండే చేసుకోవాలని ఆదేశించారు. భారత ఎన్నికల సం ఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని, సిబ్బందికి దిశా నిర్దేశం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుబ్బిర్ సింగ్ సందు తదితరులు పాల్గొన్నారు.