Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడ డివిజన్లో 1.67 శాతానికి తగ్గిన కోవిడ్ పాజిటివిటీ

– మరో 717 మందికి పరీక్షలు నిర్వహించాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 18: గుడివాడ డివిజన్లో కోవిడ్ -19 పాజిటివిటీ రేటు 1.67 శాతానికి తగ్గిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీపై శనివారం మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, గుడివాడ డివిజన్లో ఒక్కరోజే 717 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు. గుడివాడ పట్టణంలో 57 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఐదుగురికి కరోనా వైరస్ సోకిందన్నారు. పెదపారుపూడి మండలంలో 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 31 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నారు. పామర్రు మండలంలో 139 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, ముగ్గురికి కరోనా వైరస్ సోకిందన్నారు. కలిదిండి మండలంలో 61 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నారు. గుడివాడ రూరల్ మండలంలో 8 మందికి, కైకలూరు మండలంలో 64 మందికి, మండవల్లి మండలంలో 201 మందికి, ముదినేపల్లి మండలంలో 103 మందికి, నందివాడ మండలంలో ఐదుగురికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE