Suryaa.co.in

Andhra Pradesh

ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా?: రామకృష్ణ

సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ నేతల శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడను పోలీసు వలయంలో ఉంచారని ఆయన మండిపడ్డారు. విజయవాడ పోలీసు వలయంలో ఉంచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఇది ప్రజా ప్రభుత్వమా.. పోలీసు రాజ్యమా అని ధ్వజమెత్తారు. విజయవాడ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ముళ్లకంచెలు వేశారని.. సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ నేతల శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇప్పటివరకు చేయలేదని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు.

LEAVE A RESPONSE