– మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్
– గుజరాత్ వాళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు
– బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులని కేసీఆర్ కలవాలి
– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ బీహార్ వెళ్లి అక్కడి నాయకులను కలవడం ఒక ముఖ్య ఘటన. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ ని అభినందిస్తున్నా. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులని కేసీఆర్ కలవాలి.ఆప్ నాయకుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకని పట్టుకున్నారు.
కేసీఆర్ బీజేపికి వ్యతిరేకంగా మారారు కాబట్టే కేంద్ర సంస్థలు ఆయన్ని టార్గెట్ చేశాయి. బీజేపీ సినిమా యాక్టర్స్ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కి అమిత్ షా దగ్గరికి వెళ్లాల్సిన ఖర్మ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ తాత, తండ్రి మంచివాడు. నీకు ఏం గతి పట్టిందని అమిత్ షా ని కలిసావు? జూనియర్ ఎన్టీఆర్ క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి?
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక స్మగ్లర్.పనికిమాలిన పనులు చేస్తేనే తొందరగా ధనవంతులు అవుతారు.అదానీ ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు?గుజరాత్ వాళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు.18 దేశాల కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు వస్తున్నారు.కేసీఆర్ జగన్ దగ్గరికి వెళ్లి బీజేపికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒప్పించాలి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి:
సెప్టెంబర్ 4 నుండి 7వరకు శంషాబాద్ లో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం.దేశం పూర్తిగా అదానీ, అంబానీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది.అదానీ ఎక్కడివాడు? లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు?మోదీ అండదండలతో అదానీ, అంబానీలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.మా చిన్నప్పుడు విన్న టాటా, బిర్లాలు కనుమరుగైపోయారు.దేశంలో మతోన్మాదం పెరిగిపోతోంది. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం.బీజేపీ తెలంగాణకి చేసిందేమీ లేదు.బీజేపీ నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు.విభజన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ అమలుచేయలేదు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తాం.