అమరావతి : తుళ్లూరు రాజధానికి ల్యాండు పూలింగ్ కింద భూములిచ్చిన రైతులు తిరిగి పొందిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) అధికారులు లేఖలు జారీ చేశారు.ఇంటింటికి తిరిగి రైతులకు సీఆర్డీఏ సిబ్బంది అందజేస్తున్నారు.
గత ప్రభుత్వంలో రైతులకు రిటనబుల్ ప్లాట్లను దాదాపు 65 శాతం రిజిస్ట్రేన్‌లను సీఆర్డీఏ చేసింది.వాటికి హద్దురాళ్లను కూడా వేశారు.
వైసీపీ వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి పనులు నిలిపివేయంటంతో పాటు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను కూడా ఆపేశారు.ఏదో రికమండేషన్ మీద ఒకటి అర చేయటం తప్పిదే రిజిస్ట్రేషన్‌లు అనేవి పెద్దగా జరగలేదు.రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి మూడు నెలల్లో అప్ప చెప్పమని జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులలో చలనం వచ్చింది.
పలనా రైతు, పలనా ప్లాటు.. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, కనుక రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు ఏపీ సీఆర్డీఏ వెబ్ సైట్‌లో మూడు రోజులు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆ లేఖలలో పేర్కొన్నారు.
వారి దగ్గర ఉన్న భూమికి సంబందించిన ఒరిజినల్ పత్రాలను అందజేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ పక్రియను మార్చి 31వ తేదీలోపు పూర్తి చేసుకోవాల్సిందిగా కాంపిటెంట్ అథారిటీ అండ్ స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్ పేరు మీద లేఖలను జారీ చేశారు.
ఈ విషయంలో సందేహాలు ఏమైనా ఉంటే తుళూరు సీఆర్డీఏ కార్యాలయ పనిదినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రందించాలని పేర్కొన్నారు.రైతులకు ఏవైనా సందేహాలుంటే, 08645-244774 , 80645-244778 ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని లే ఖలో పేర్కొన్నారు.