Suryaa.co.in

Andhra Pradesh

విభిన్న ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చిన ఘనత టీడీపీదే: దేవినేని ఉమా

విభిన్న ప్రతిభావంతులకు గుర్తింపు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అదేశాలతో విభిన్న ప్రతిభావంతుల విభాగం గౌరవ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు అధ్యర్యంలో పార్టీ జాతీయ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, బుచ్చి రాంప్రసాద్‌, కంచర్ల శ్రీనివాస్‌, విభిన్న ప్రతిభావంతుల విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పూదోట సునిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ విభిన్న ప్రతిభివంతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించి అండగా ఉండేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతోపాటు అనేక విధాలుగా గుర్తింపునిచ్చి వారిని వృద్ధిలోకి తెచ్చింది ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి నోరు రావడం లేదని విమర్శించారు.

రాష్ట్రస్థాయిలో వారి కోసం సమావేశం ఏర్పాటు చేసే ధైర్యం ముఖ్యమంత్రి కి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విభిన్న ప్రతిభావంతుల కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. దివ్యాంగుల వివాహం సందర్భంగా చదువుతో నిమిత్యం లేకుండా లక్ష రూపాయల ప్రోత్సాహం ఇప్పిస్తామన్నారు. ఉచితంగా ట్రై సైకిళ్లు ఇప్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నీలా జోజిబాబు, దుర్గారావు, శ్రీనివాసగౌడ్‌, వెంకటరావు, ఎల్లప్ప, వీరారెడ్డి, రాము, జాకబ్‌, సాయి జనార్దన్‌, బాలు, మధుసూదన్‌, బాలరాజు, రాధాకృష్ణ, బాషా, పుద్దయ్య, లక్ష్మి, భార్గవి, శిరీష, కార్తీక, తదితరులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర గౌరవ అద్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ వికలాంగుల పింఛన్‌ రూ. 5000కు పెంచాలని, ప్రతభ ఆధారంగా బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని, ఉన్నత చదువులు చదువుకునే దివ్యాంగులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుతో మాట్లాడి ఇవన్నీ అమలు జరిగేలా చూస్తామన్నారు. దివ్యాంగులకు ఉచిత గృహా నిర్మాణం ప్రభుత్వమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కంచర్ల శ్రీనివాస్‌ 1000 మందికి దుప్పట్లు, స్వీట్లు పంపిణి చేశారు. పూదోట సునీల్‌ మాట్లాడుతూ దివ్యంగులు ఎదుర్కొంటున్న సనుస్యలు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి తేవాలన్నారు. ఋచ్చి రాంప్రసాద్‌ మాట్లాడుతూ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే దివ్యాంగులకు ఎన్‌ఆర్‌ఐల ద్వారా ఆర్థికంగా అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE