Suryaa.co.in

Features

విమర్శ కూడా.. ఆరాధనే!

నిన్ను శత్రువుగా చూడట్లేదు అంటే నువ్వు ముఖ్యమైనవాడివి కాదని అర్థం.
నిన్ను ఎవరు ముప్పుగా భావించట్లేదంటే నువ్వు శక్తివంతుడివి కాదని అర్థం.
నీ వెనకాల ఎవరు నీ గురించి మాట్లాడటం లేదు అంటే నువ్వు అత్యుత్తమమైన వాడివి కాదని అర్థం.
నీ ద్వారా ఎవరో ప్రయోజనం పొందుతున్నారంటే నీకు విలువ ఉందని అర్థం.
నిన్ను ఎవరో ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే నీవు శక్తివంతుడివి అని అర్థం.
నిన్ను ఎవరో అనుకరిస్తున్నారంటే నువ్వు ఆకర్షణీయుడవని అని అర్థం.
నిన్ను ఎవరో నిందిస్తున్నారు అంటే నువ్వు ప్రముఖుడివి అని అర్థం.
నిన్ను ఎవరో వెక్కిరిస్తున్నారంటే నీకు ప్రత్యేక ఆలోచన ఉందని అర్థం.
నిన్ను ఎవరో ఎదిరిస్తున్నారంటే నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివి అని అర్థం.
చివరిగా ఆ నిన్ను నిన్ను గా నడిపే శక్తి ఏంటో తెలుసుకో..

– యేలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం
తాడిగడప, విజయవాడ

LEAVE A RESPONSE