విజయవాడ: దసరా మహోత్సవములు సందర్బంగా దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ నగర్ లో ఏర్పాటు చేసిన కళావేదిక పై ఆధ్యాత్మిక కళాప్రదర్శనలతో దుర్గమ్మకు కళారాధన జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన జయ జయ నటరాజ మూషిక వాహన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారి జష్రిత దేవినేని అద్భుతమైన నృత్యం ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వేలాది భక్తులెందరో హాజరై దుర్గమ్మ దర్శనం చేసుకొని, సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి ఆనందభరితమైన అనుభూతిని పొందారు.
ఉదయం 10 గంటలకు కళా వేదిక వద్ద పూజా కార్యక్రమముల అనంతరం విజయవాడ, పి. ప్రమీల రాణి బృందం భజన సంకీర్తన, దుర్గేష్ నందిని బృందం భక్తి సంగీతం, ఎం. రాంబాబు -కాళీ మాత మహిమలు గురించి హరి కదా గానం జరిగింది.
సాయంత్రం నందిని బృందం కూచిపూడి నృత్యం, అపర్ణ బృందం నృత్యం, ముంబై నగరానికి చెందిన వరలక్ష్మి బృందం భక్తి రంజని, సత్య వాణి బృందం భరతనృత్యం, ఆర్. శ్రీనివాస్ బృందం ఆంధ్ర నృత్యం వైభవం గా జరిగాయి.
సాయంత్రం జిల్లా కలెక్టర్ లక్ష్మి శ, మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో శీనా నాయక్ కళావేదిక వద్దకు విచ్చేసి కార్యక్రమాలు వీక్షించారు.
దేవస్థానం నుండి కళాకారులకు మెమెంటో, సర్టిఫికెట్, ప్రసాదం, రూ. 300/- క్యూ లైన్ ద్వారా దర్శనం ఏర్పాటు జరిగింది.కార్యక్రమముల ఏర్పాట్లును సహాయ కార్యనిర్వాహణాధికారి డాక్టర్ గంగాధర్, పర్యవేక్షకులు సునీత తదితరులు పర్యవేక్షించారు.