-విద్యుత్ చార్జీలు 8 సార్లుపెరిగాయి
-రాజానగరంలో ఆవ భూముల పేరుతో 500 కోట్ల స్కాం
-భారతి సిమెంట్ ధరలు ఎంత ఉన్నాయి?
-రైతును రాజును చేస్తా
-అన్నీ ఉన్నా అల్లుడి నోట్లే శని అన్నట్లు మనకు జగన్ ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడు -రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్యత మీది
-సర్పంచ్ లకు గౌరవం లేదు. పనులు అవ్వడం లేదు
-సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా రాజానగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాను. ప్రతి జిల్లాలో ప్రాజెక్టులు పరిశీలిస్తున్నా. రాజానగరంలో అధికార పార్టీ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ మీ రౌడీ రాజకీయాలు నడవవు. వైసీపీ నేతలను ఈ ఈస్టు గోదావరి జిల్లా ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపబోతున్నారు.
మేము వస్తుంటే కరెంట్ నిలపివేయడం లాంటి చిల్లరి పనులు మానుకోవాలి. నేను చాలా సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. కానీ ఇంత స్పందన ఎప్పుడూ చూడలేదు. ఆడపిల్లలు, యువత పెద్దఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. జిల్లాలో పోలీసు అధికారులు పోలీసు సిబ్బందిని తప్పు దోవ పట్టిస్తున్నారు.వైసీపీ నేతలు తమ నేరాల్లో పోలీసులను భాగస్వాములను చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన నియోజకవర్గవాసి సునీల్ కు పోలీస్ స్టేషన్ లోనే గుండుకొట్టించిన వైసీపీ నేతలు.తనకు జరిగిన అన్యాయాన్ని సభలో వివరించిన సునీల్. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు సర్వాసాధారణం అయిపోయాయి. జగన్ రెడ్డి నా ఎస్సీలు అంటాడు…మరి ఆ ఎస్సీలు పై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావ్.
దళితుడిని చంపిన ఎమ్మెల్సీ అనంత బాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.పైగా దళితుడిని చంపిన వ్యక్తిని సభలో పక్కన పెట్టుకుంటావా. ఇదేనా నా దళితులు అంటే?నర్సీపట్నంలో మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపారు.జగన్ రెడ్డి ఎంత మంది దళితులను పొట్టన పెట్టుకుంటాడు…
దళితులకు 27 కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఇది. అధికారంలోకి వచ్చిన తరవాత దళితులకు న్యాయం చేస్తాం. దళిత ద్రోహి జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం. జగన్ విమానంలో, హెలికాఫ్టర్ లో, పరదాలు కట్టుకుని తిరగడం కాదు. రోడ్డుమీద తిరిగితే ప్రజల సమస్యలు అర్థం అవుతాయి.
పురుషోత్తం పట్నం లిఫ్ట్ పనులు తెలుగు దేశం హయాంలో చేపట్టాం. దీని ద్వారా రెండు లక్షల ఎకరాల్లో నీరు ఇచ్చే అవకాశం ఉంది.అలాంటి ప్రాజెక్టులో సిఎం నాలుగేళ్లుగా పనులు చేయలేదు. పంపులు ఆన్ చేయలేదు. ఒక్క పురుషోత్తం పట్నమే కాదు..పుష్కర లిఫ్ట్ కూడా మూతపడింది. పోలవరాన్ని పూర్తి చేసుకుని రాజానగరానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. తెలుగు దేశం వచ్చిన తరువాత రాజానగరానికి నీళ్లు ఇస్తాం.
రాష్ట్ర యువత ఆలోచించాలి….ఉద్యోగాలు వచ్చాయా….జాబ్ క్యాలెండర్ వచ్చిందా….నాలుగు ఏళ్లు గడిచింది జాబ్ క్యాలెండర్ రాలేదు. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి లేదు…ఒక్క ఉద్యోగం లేదు. జాబు రావాలి అంటే బాబు రావాలి. నా సభలకు యువత పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీనికి కారణం….వారు ఉద్యోగం కోరుకుంటున్నారు. నేను ఉద్యోగాలు కల్పిస్తా అనే నమ్మకం చూపిస్తున్నారు.
ఈ యువత భవిష్యత్ నాదే. ఎన్నికల్లో ఈ యువత, పిల్లలే నా సైన్యం. 25 ఏళ్ల క్రితం ఐటీ ని తీసుకురావడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాం.దీంతో తెలుగు జాతి దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ పరిశ్రమలు తీసుకువస్తా….యువతకు ఉద్యోగాలు కల్పిస్తా.
మహిళల కోసం మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించాను. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి చదువుకు రూ.15000 ఇస్తా. చదువుకునే ప్రతి బిడ్డకు రూ. 15000 ఇస్తా…ఎటువంటి కోతలు లేకుండా సాయం చేస్తా.ఆడబిడ్డనిధి కింద రూ.1500 నెలకు మహిళల అకౌంట్లో వేస్తా.మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తా.
నేడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం, వంటనూనె, కందిపప్పు, చింతపండు, పెసరపప్పు, చక్కెర ధరలుపెరిగిపోయాయి. కూరగాయలు, పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. విద్యుత్ చార్జీలు 8 సార్లుపెరిగాయి. ప్రజలు ఈ ధరలతో అల్లాడిపోతున్నారు.
తెలుగు దేశం వచ్చిన తర్వాత కరెంట్ చార్జీలు పెంచను. నాడు ఇంటిపన్ను లేదు..నేటి ఇంటిపన్నుతో కూడా కొత్త బాదుడు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. ఇసుక మాఫియా దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు.
భారతి సిమెంట్ ధరలు ఎంత ఉన్నాయి….ఎందుకు సిమెంట్ ధరలు అంత పెరిగాయి. ఇక మద్యం గురించి అయితే చెప్పేదే లేదు….అధిక ధరలు, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు. జగన్ మద్యపాన నిషేదం అన్నాడు…మద్యం రేట్లు పెంచాడు…మరి మద్య పాన నిషేదం చేశాడా….మద్యం అమ్మకాల పేరు చెప్పి 25 వేల కోట్ల అప్పులు తెచ్చాడు…నిషేదం ఎప్పుడు చేస్తాడు.
దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఎపిలోనే ఎందుకు ఉన్నాయి. దీనికి కారణం ఎవరు….ఈ బ్రాండ్లు ఎవరికి…ఈ దోపిడీ ఎటుపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి…ఆడబిడ్డలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించాను.ఆర్టీసీ బస్సుల్లో ఆబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇస్తున్నాం. మహిళలు ఉచిత ప్రయాణంతో తమ పనులు చేసుకోవచ్చు.
రైతులకు అన్నదాత పథకం కింద…..ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను. రైతును రాజును చేస్తాను. ఈ రోజు రైతులు రూ. 2.45 లక్షల తలసరి అప్పుల్లో ఉన్నారు. రైతులు ఈ స్థాయి అప్పుల పాలు అవ్వడానికి ప్రభుత్వ విధానాలే కారణం.
ఎపిలో ధాన్యం సాగు తగ్గింది…ఉత్పత్తి పడిపోయింది. తెలంగాణ లో ఎపికంటే తక్కువ విస్తీర్ణం సాగు అవుతోంది. ఇదీ నేడు సాగు పరిస్థితి. సోలార్ విద్యుత్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయానికి, వాణిజ్యానికి, ఇళ్లకు సోలార్ విద్యుత్ ఉపయోగించవచ్చు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సోలార్, విండ్ విద్యుత్ ద్వారా లబ్ది చేకూర్చుతా.
జగన్ సంక్షేమం అని 10 రూపాయాలు ఇచ్చి 100 రూపాయాలు గుంజుతున్నాడు.దీంతో రాష్ట్రం నాశనం అవుతుంది. నీరు, ఖనిజసంపద, మంచి భూములుఉన్న రాష్ట్రం మనది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లే శని అన్నట్లు మనకు జగన్ ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్యత మీది. మీ భవిష్యత్ కు బాధ్యత నాది.
రాజానగరంలో ఆవ భూముల పేరుతో 500 కోట్ల స్కాం జరిగింది. ఎమ్మెల్యే ఆవ భూముల పేరుతో దోచేశాడు. కొండలను ఎమ్మెల్యే కరిగించి వేస్తున్నాడు. ఇసుక దోపిడీ జరుగుతోంది. నియోజకవర్గంలో ఎవరైనా లే అవుట్ వేస్తే వాటా ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో భూమి అమ్మాలన్నా కొనాలన్నా వీళ్ల అనుమతి కావాలి. వీళ్లకు కప్పం కట్టాలి. వీళ్లను ఇలా వదిలేస్తే భార్యాభర్తల కాపురం చేయాలి అంటే కూడా కప్పం కట్టాలి అంటాడు.
రాష్ట్రం అంతా జె ట్యాక్స్…ఇక్కడేమో జక్కంపూడి ట్యాక్స్. ఎమ్మెల్యేకు గొప్ప తమ్ముడు ఉన్నాడు. అతను కొండలను కొల్లగొడుతున్నాడు. ఎప్పుడైనా మన హయాంలో గంజాయి ఉందా..కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి లభిస్తుంది. నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ లు, బ్లేడ్ బ్యాచ్ లు.
ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. కానీ యువత గంజాయికి అలవాటు పడితే వారిని మార్చలేం. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.ఈ రాష్ట్రంలో వ్యవసాయం లేదు. సాగు లేదు కానీ…..గంజాయి మాత్రం అన్ని చోట్లా ఉంది. రాష్ట్ర పంటగా గంజాయి ని ప్రకటించేలా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా….నియోజవర్గ రోడ్లపై వీడియోలే. అంత దారుణంగా ఈ రోడ్లు ఉన్నాయి.
నేను అందుకే చెపుతున్నా….మళ్లీ రోడ్లు బాగుపడాలి అంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి.నియోజకవర్గంలో కాలువలకు పూడిక తీసే పరిస్థితి కూడా లేదు. పంచాయతీ డబ్బులు కొట్టుశారు. గ్రామాల్లో కనీస పనులు జరగడం లేదు. సర్పంచ్ లకు గౌరవం లేదు. పనులు అవ్వడం లేదు.
అందుకే సైకో పోవాలి….సైకిల్ రావాలి.అధికారంలోకి వచ్చినతరువాత ఆవ భూముల వద్ద లిఫ్ట్ పెట్టి ముంపు లేకుండా చేస్తా. వెంకట రమణ ఇక్కడ ఇంచార్జ్ గా ఉన్నారు. వచ్చే 20 ఏళ్లు వెంకట రమణ నియోజకవర్గాన్ని చూసుకుంటాడు. రాష్ట్రం బాగు పడాలి అంటే సైకో పోవాలి….సైకిల్ రావాలి.