Suryaa.co.in

Andhra Pradesh

ఏం పాదం సామీ నీది… దరిద్రపు పాదం!

-ఒక చిన్నాన్న, ఇంకో చిన్నాను చంపేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష?
-విజయసాయిరెడ్డి టీవీల మందుకొచ్చి గుండెపోటు అన్నాడు
-రక్తపు వాంతులతో కక్కుకుని బాత్ రూమ్ లో కబోర్డు కొట్టుకుని చనిపోయాడని ఆస్కార్ రేంజ్ లో చెప్పాడు జగన్ రెడ్డి
-వీళ్ల చెల్లి రాష్ట్రానికి రానంటుంది.. అమ్మ పార్టీలోకి రానంటుంది
-పోలీసులు అడ్డంపెట్టుకొని తప్పుడు కేసులు పెడుతున్నారు
-తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం కక్కిస్తాం
– అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి రైతులను ఆదుకోవాలని తెదేపా నేత, మాజీ మంత్రి .
నిరసన ర్యాలీ
– రైతులను తక్షణమే ఆదుకోవాలని రెడ్డిగూడెం సెంటర్ లో మామిడి కాయలు పారబోసి రైతులు స్థానికులతో కలసి నిరసన

మైలవరం (రెడ్డిగూడెం) : మామిడి రైతులను ఆదుకోమని ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఈ సర్కార్ కు సోయలేదు. మామిడి రైతుల గురించి పట్టించుకున్న దిక్కులేదు ధాన్యం రైతుల కష్టాలు పట్టడం లేదు. ఏం పాదం సామీ నీది దరిద్రపు పాదం.పది రూపాయలు ఒక చేత్తో ఇస్తూ, యాభై రూపాయలు లాక్కుంటున్నారు.

ఏ కన్ను ఏ కన్నును పొడిచింది.. ఏ చెయ్యి ఏ చెయ్యిని పొడిచింది ఒక చిన్నాన్న, ఇంకో చిన్నాను చంపేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష? కడప ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు పోతాడని, విద్యాదీవెన బటన్ కూడా నొక్కలేదు. పులివెందుల ఇంట్లో తలుపులు వేసి గంటసేపు చిత్రహింసలు చేసి గొడ్డలితో చంపేశారు . ఒకరోజు ముందు కుక్కను చంపారు. ఈ కేసులో సీబీఐకు వెళ్లాల్సిన ముగ్గురు చనిపోయారు. కుట్లేసిన డాక్టర్ కరోనాలో పోయాడు. అంటే ఒక హత్య కేసులో నుండి బయటపడటానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టాడు, రైల్వే జోన్ అడగటం మానేసాడు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో 36 మంది చనిపోయారు. అమ్మకానికి పెట్టించాడు. అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు ఇచ్చాడు కాకినాడ సెజ్ లక్షల ఎకరాలు దోచిపెడుతున్నాడు. విజయసాయిరెడ్డి టీవీల మందుకొచ్చి గుండెపోటు అన్నాడు.. అంతకు ముందు రక్తపు వాంతులతో కక్కుకుని బాత్ రూమ్ లో కబోర్డు కొట్టుకుని చనిపోయాడని ఆస్కార్ రేంజ్ లో చెప్పాడు జగన్ రెడ్డి. చచ్చిపోయిన వ్యక్తికి కుట్లేసారు. ఎంత గుండెలు తీసినబంటు… తరువాత చంద్రబాబు నాయుడు చేతిలో కట్టిపెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆరోపణలు చేశారు. బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను జగన్ రెడ్డి కాపాడాడు. నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయి.

సింహాసనం మీద కూర్చే రాజు ముద్దాయిలను కాపాడకూడదు. సీబీఐ కేసుల్లో ముద్దాయి వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాడు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి అనర్హుడు. ప్రతిపక్షంలో నాడు సీబీఐ కావాలన్నాడు అధికారంలోకి వచ్చాక సీబీఐ వద్దు పొమ్మన్నాడు. సునీతమ్మ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లింది న్యాయం ధర్మం గెలిచేవరకు పోరాడింది. వీళ్ల చెల్లి రాష్ట్రానికి రానంటుంది.. అమ్మ పార్టీలోకి రానంటుంది ఏం చెప్పమంటారు నా నోటితో ఇవన్నీ. ప్రపంచంలో దేశ, విదేశాల్లో మన రెడ్డిగూడెం బంగినపల్లి మామిడి కాయ రారాజు దానికి నేడు కష్టం వచ్చింది ప్రభుత్వం ఆదుకోదా? అవినాష్ రెడ్డిని రమ్మని సీబీఐ వాళ్లు పిలిస్తే , నన్ను అరెస్ట్ చేయొద్దని కోర్టుకు వెళ్లాడు.. కోర్టులో కాగితాలు వేయడం, వారం రోజులు ఎగ్గొట్టడం. బాబాయ్ ని చంపిన వాళ్లు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు .. వాళ్ల కదలికలు అన్నీ కూడా గూగల్ టేక్ అవుట్ లో ఉన్నాయి. దేవుడున్నాడు కాబట్టి ఈ పాపాలన్నీ బయట పడ్డాయి. రంకులు, బొంకులు దాగవు .. తాడేపల్లి రాజ్యాంగం నడిపించాలంటే ప్రజలు ఒప్పుకోరు గతంలో శాస్త్రవేత్తలను పంపించి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్లం. నేడు ఆ పరిస్థతి లేదు. మూడువేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? నాలుగువేల కోట్ల విపత్తుల నిధులు ఏమయ్యాయి?

బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిన తరువాత వైసీపీ నాయకులు వెనక్కి తీసుకున్నారు. దీనికోసమా ఒక్కఛాన్స్ అని ముద్దులు పెట్టారు. చింతలపూడి ఎత్తిపోతలు నాశనం చేశారు. నాలుగువేల కోట్లు ఖర్చుపెట్టబడి ఉన్నాయి.. నేడు ఇసుక, మట్టి, సిమెంట్, స్టీల్ ఎత్తుకుపోతున్నారు వీళ్లా చింతలపూడి పూర్తి చేసేది? పట్టిసీమ పంపులు, మోటార్లకు బూజు పట్టించారు. గోదావరి నీళ్లు కొన్ని వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం డ్యామ్ ను పోలవరం బ్యారేజీ చేస్తున్నాడు. మీరు పంపించిన ధాన్యం రేటు వాళ్లు నిర్ణయిస్తారట.. మొక్కజొన్న నేలమీద పడుకొంది.. నాటు పొగాకు రైతులకు డబ్బులు ఎవరు ఇస్తారు? వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా కౌలు రైతులను ముంచేశారు. కొండపల్లి అడవిని కొట్టేసారు, షాబాద-జక్కంపూడి కొండలు గుల్ల చేశారు. రుషికొండ బొడిగుండు అయినట్టుగా తాడేపల్లి పోలవరం గట్టు మొత్తం దోచేసారు వీళ్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు? ఈ పెద్ద మనిషి ఉత్తరం రాసాడంట.. విజిలెన్స్ రిపోర్టు వచ్చింది. అధికారం ఉందని పోలీసులు అడ్డంపెట్టుకొని తప్పుడు కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం కక్కిస్తాం.

LEAVE A RESPONSE