-అలాగే 25 ఎంపీ సీట్లలోనూ పోటీ చేస్తున్నావా?
-లేక తెలుగుదేశం పార్టీ కోసం కాపులను బలి పెట్టదల్చుకున్నావా?
-నీది అసలు జనసేనా… లేక తెలుగు జనసేనా?
-పవన్‌కళ్యాణ్‌వి ప్యాకేజీలు. ప్యాకప్‌లు
-ఆయనవి విలువ లేని రాజకీయాలు
-గత ఎన్నికల్లో రెండు చోట్లా చిత్తుగా ఓడిపోయావు
-అయినా చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు
-అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు
-రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
ప్రజలు నవ్వుకుంటున్నారు:
చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు ఎటువైపు ఉన్నారనేది వారికి పట్టడం లేదు. ఎంతసేపూ ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. తాను స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే జనసేన పార్టీ ఏర్పాటు చేశానని నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ వాస్తవం ఏమిటన్నది ప్రజలందరికి తెలుసు.
దమ్ముంటే ఆ పని చేయి:
నేను పవన్‌కళ్యాణ్‌ను ఒకటి సూటిగా అడగదల్చాను. అసలు నీకు స్వతంత్య్రం ఉందా? నేను నిన్ను సవాల్ చేస్తున్నాను. ముందు నీవు చంద్రబాబు నుంచి స్వాతంత్య్రం పొంది, 2024 ఎన్నికల్లో నీకు నీవుగా నీ మ్యాండేట్ మీద మొత్తం 175 అసెంబ్లీ లేదా 25 ఎంపీ సీట్లలో పోటీ చేస్తావా? లేక తెలుగుదేశం పార్టీ కోసం కాపులను బలి పెట్టదల్చుకున్నావా? నీది అసలు జనసేనా… లేక తెలుగు జనసేనా?.
నీకు దమ్ముంటే, వచ్చే ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ, ఎంపీ సీట్లలో పోటీ చేయాలి. అంతే కానీ ప్యాకేజీ అందగానే అప్పుడప్పుడు రావడం, రాజకీయాలు చేయడం, ప్యాకప్ చెప్పి వెళ్లడం కాదు. ఇలాంటి రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించబోరు.
దిక్కు తోచక తుచ్ఛ రాజకీయాలు:
ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకూ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీన్ని చూపి చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ తట్టుకోలేక పోతున్నారు. అదే విధంగా ఏ సర్వే చూసినా కూడా వైయస్సార్‌సీపీదే విజయం అని చెబుతున్నాయి. ఆ సర్వేల ఫలితాలు కానీ, ప్రజల స్పందన అంత స్పష్టంగా ఉండడంతో, దిక్కు తోచని మీరు తుచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు.
నీకంటూ స్టాండ్ ఉందా?:
పవన్‌కళ్యాణ్ మీకు ఒక స్థిరమైన వైఖరి ఉందా? ఒక స్టాండ్ మీద నిలబడగలరా? 2001లో నీవు పెప్సి డ్రింక్ యాడ్ చేశావని చెప్పి, చంద్రబాబు వర్గమంతా ఆ డ్రింక్‌ను బాయికాట్ చేయగా, అదే వర్గం చిరంజీవిగారు థమ్సప్ డ్రింక్ యాడ్‌లో నటిస్తే, దాన్ని కూడా బాయికాట్ చేసింది. అయినా నీవు ఏ మాత్రం నైతికత లేకుండా చంద్రబాబును సమర్థిస్తున్నావు. అయితే నీ అవసరం తీరగానే, నీకిచ్చే ప్యాకేజీ అయిపోగానే, చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నిన్ను పూర్తిగా పక్కన కూర్చోబెడతారు.
ఎక్కువగా ఊహించుకుంటున్నావు:
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావు. అయినా నీ గురించి నీవు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. షణ్ముఖ వ్యూహం పన్నుతాను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని అంటున్నా, నీవు వాస్తవానికి చేసేది, చంద్రబాబు చెప్పింది అమలు చేయడమే. అంటే చంద్రబాబు చెప్పిన వ్యూహాన్ని మాత్రమే నీవు అమలు చేస్తావు. అందుకే ఇప్పుడు కూడా విలువలేని రాజకీయాలు చేస్తున్నావు.. అని పవన్‌కళ్యాణ్‌కు మంత్రి దాడిశెట్టి రాజా చురకలంటించారు.