-దారి తెలియక లోకేష్ అనే ఒక ఊరపంది రాష్ట్రంలో తిరుగుతుంది
-కరువు రక్కసికి తాత చంద్రబాబు.. సెల్ఫోన్ లైట్లు కనిపెట్టాడంట..
-తూ.గో జిల్లాకు ఫలానా మంచి చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా..?
-సీఎం వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం
-దయచేసి బాబు వెంట వెహికిల్లో నలుగురు మానసిక వైద్యులను పంపించాలి
-ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
తుని: చంద్రబాబు నాయుడు అనే దరిద్రుడికి ఒక వెహికిల్ కేటాయించి దాంట్లో నలుగురు మానసిక వైద్యులను ఆయన వెంట పంపించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి వైయస్ జగన్ను విజ్ఞప్తి చేశారు. పిచ్చి ముదిరి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, ప్రజలను పక్కదోవపట్టించేలా పచ్చి బూతులు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తుంటే కరువు రక్కసికి తాత వచ్చి జిల్లాలో తిరుగుతున్నాడని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. తునిలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోకేష్ అనే ఒక ఊరపంది పదిమంది కూడా లేని పాదయాత్ర పేరుతో తిరుగుతుందన్నారు. సీఎం వైయస్ జగన్ డీఎన్ఏల గురించి ఆ ఊరపంది మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి డీఎన్ఏ ఏంటో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసన్నారు. ‘ముందు నీ డీఎన్ఏ ఏంటో ఒకసారి చెక్ చేసుకో లోకేష్.. నీది రాయలసీమ డీఎన్ఏ కాదు.. తెలంగాణ డీఎన్ఏ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుస’న్నారు.
చంద్రబాబు పరిపాలనలో కరువు రక్కసి రాష్ట్రాన్ని పట్టి పీడించిందని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని సగం మండలాలు కరువు మండలాలుగా ప్రతి ఏటా ప్రకటించారన్నారు. కరువు రక్కసికి తాత చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. గతంలో తూ.గో జిల్లా ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పి 4 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వైయస్ జగన్ చేస్తున్న పరిపాలన చూసి ఫ్రస్టేషన్లో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. ‘తమ్ముళ్లు మీ సెల్ ఫోన్లో వెలిగే లైట్లు కనిపెట్టింది నేనే’ అని గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు.
చంద్రబాబు అనే వ్యక్తికి ఫలానా మంచి చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదని, అందుకే ప్రజలను పక్కదోవపట్టించేందుకు కళ్లబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ‘తమ్ముళ్లు మీకు వైయస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని మీటింగ్కు వచ్చేవారిని చంద్రబాబు అడిగితే.. చాలా పారదర్శకంగా పథకాలు అందుతున్నాయని వారే సమాధానం చెబుతారు’ అని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకు ఫలానా మంచి చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు.
‘సీఎం వైయస్ జగన్ను విజ్ఞప్తి చేస్తున్నాను.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అనే ఒక దరిద్రుడికి మన రాష్ట్రంలో ఇల్లు లేదు. ఇల్లుంటే ఆ ఇంటి పక్కన ఒక మెంటల్ ఆస్పత్రి కట్టాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేదు కాబట్టి ఒక వెహికిల్ కేటాయించి దాంట్లో నలుగురు మానసిక వైద్యులను చంద్రబాబు వెంట పంపించాలని సీఎం వైయస్ జగన్ను విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. సైకిల్ పోవాలని, తెలుగుదేశం ఓడిపోవాలని ఆయన పార్టీకి ఆయనే తూట్లు పొడుచుకుంటున్నాడు. ప్రజలను పక్కదోవ పట్టించడానికి రకరకాల బూతులు మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిని, చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవ్వరూ ఏమీ అనలేదు. చంద్రబాబు అనే సన్నాసి అసెంబ్లీ నుంచి బయటకువచ్చి డ్రామా ఆడుతూ వెక్కివెక్కి ఏడ్చాడు’ అని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు.
‘రాష్ట్రంలో లోకేష్ అనే ఒక ఊరపంది తిరుగుతుంది. డీఎన్ఏ గురించి ఆ పంది మాట్లాడుతుంది. లోకేష్ డీఎన్ఏ ఏంటీ అని నేను ప్రశ్నిస్తున్నాను. నీది తెలంగాణ డీఎన్ఏ.. రాయలసీమ డీఎన్ఏ కాదు అని ఈ రాష్ట్రంలోని అందరికీ తెలుసు. లోకేష్ బూతులు మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడితే తండ్రీకొడుకులు అన్నీ మూసుకొని కూర్చుంటారు. పాదయాత్రలో కనీసం పదిమంది కూడా లేకుండా ఊరపందిలా తిరుగుతున్నాడు. సీఎం డీఎన్ఏ ఏంటో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. నీ డీఎన్ఏ ఏంటో ఒకసారి చెక్ చేసుకో లోకేష్. నీది రాయలసీమ డీఎన్ఏ కాదు.. తెలంగాణ డీఎన్ఏ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యమంత్రి వైయస్ జగన్, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం’ అని మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు.