Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన ఆచంట నియోజకవర్గ దళిత నేతలు

అమరావతి: రాష్ట్రంలో ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్రం అంతటా విస్తరించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ సభ నిర్వహణకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చేశారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలోనూ పేదల ఇళ్లు కూల్చేశారని, ఇది పేద వాళ్ల జీవితాలను కూల్చే ప్రభుత్వం అని చంద్రబాబు మండి పడ్డారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆచంట నియోజకవర్గానికి చెందిన దళిత నేత చిర్రా బాలాజీ తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. దళితులకు సంబంధించి టీడీపీ హయాంలో అమలు చేసిన 25 కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు అన్నారు. వైసిపికి వ్యతిరేకంగా పోరాడటానికి అన్ని వర్గాలు సమాయత్తం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తలపై తుపాకీ పెట్టి ప్రజల ఆస్తులు వైసిపి నేతలు కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE