శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?

Spread the love

-బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డికి కనిపించడంలేదా?
-టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి రైట్ హ్యాండ్ ,ఉత్తరాంధ్రలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు? అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా ఎండీగా ఉన్నారు. మద్య పాన నిషేదంపై గొప్పలు చెప్పే జగన్ రెడ్డి ఈ అరెస్ట్ వ్యవహారంపై ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేదం చెస్తానని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషించారు.

మూడున్నరేళ్లుగా శాండ్, మైన్, వైన్ , ఇసుక, మద్యం, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్ రెడ్డి వైద్య రంగం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. జగన్ రెడ్డి మద్యం మాఫియాకు మహిళల మాంగల్యాలు తాకట్టు పెట్టారు. కల్తీ మద్యంతో వేలాదిమంది ప్రాణాలను బలిగొన్నారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించారు. చంద్రబాబు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల పథకాన్ని కంటి వెలుగు పథకం పేరు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారు.

నాడు లక్షలాదిమందికి చంద్రబాబు గారు కంటి చికిత్సలు చేయించి కళ్లజోళ్లు అందిస్తే మీరు చేసిందేంటి? కళ్ల జోళ్లు ఇవ్వడంలేదంటూ రాయలసీమలో వృద్ధులు రోడ్డెక్కారంటే కంటి వెలుగు ఎలా అమలవుతోందో అర్ధం చేసుకోవచ్చు. కంటి చికిత్సలు చేసిన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది వాస్తవం కాదా జగన్ రెడ్డీ?

కొవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం కాపాడతారా? అంతటి విపత్తులోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భోజనాలు అందిస్తే బిల్లులు బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లను ఏడిపిస్తున్నారు. చివరకు కొవిడ్ మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పి కోట్లు స్వాహా చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది.

కరోనాతో 14,733 మంది చనిపోయారని లెక్కలు చెప్పి 47,228మందికి నష్టపరిహారం చెల్లించామని కేంద్రానికి లేఖ రాయడం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. కరోనా మరణాలపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా జగన్ రెడ్డికి. గతంలో కరోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి పీడీ ఖాతాలకు మళ్లించడంపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు. కరోనా ఫోర్త్ వేవ్ పరిస్థితి ఏంటనే ముందు ఆలోచన కూడా లేకుండా నిధులు పక్కదారి పట్టించేశారు. తన ధనదాహం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేందుకు సైతం జగన్మోహన్ రెడ్డి వెనకాడటం లేదు.

ప్రభుత్వాసుపత్రులను అత్యాచార కేంద్రాలుగా మార్చిన జగన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవం తెస్తాడా? చంద్రబాబు పాలనా సామర్థ్యం, ముందుచూపుకు మెడ్ టెక్ జోన్,జెనోమ్ వ్యాలీ నిదర్శనం. హైదరాబాద్ లాంటి కర్ఫ్యూ సిటీని కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబు గారిదే. నిత్యం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తపించిన చంద్రబాబు గారికి కొవిడ్ మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధులనూ కొట్టేసిన జగన్ రెడ్డికీ పోలికా? ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వస్తాయన్న అంబులెన్స్ ల జాడ లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డికి కనిపించడంలేదా?

గత టీడీపీ హయాంలో చంద్రబాబు కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని భౌతిక కాయాన్ని స్మశానానికి తీసుకెళ్లడం వరకూ మనిషి అన్ని దశల్లోనూ సంక్షేమం అమలు చేస్తే జగన్ రెడ్డి రాజకీయ కక్షతో అనేక పథకాలను నీరుగార్చాడు. ఎన్టీఆర్ బేబీకిట్లు, తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్, మహా ప్రస్థానం పథకాలను నిర్వీర్యం చేశాడు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రజలకు అండగా నిలిచిన పీహెచ్ సీలు, సీహెచ్ సీలను నిరుపయోగం మార్చేశారు. నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారాసిట్మాల్ కూడా దొరకని దుస్థితికి జగన్ రెడ్డి పాలనా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణం.

తెలుగు వారికి ఒక హెల్త్ యూనివర్సిటీ ఉండాలనే లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ తీసుకొస్తే దానిపైనా జగన్ రెడ్డి కక్ష కట్టాడు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం. మహనీయుల గొప్పతనం తెలియని మూర్ఘుడు జగన్ రెడ్డి. మూడున్నరేళ్లుగా మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలియని జగన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు కడతారా?

నాడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కోటీ 30 లక్షలమందికి వైద్యం అందిస్తే నేడు ఆరోగ్యశ్రీని అవినీతిమయం చేశారు. పేదలకు ఉచిత వైద్యం దూరం చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆరోగ్యశ్రీ నిధుల మళ్లింపు ప్రజారోగ్యంపై జగన్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? టీడీపీ హయాంలో పేదలకు అండగా నిలిచిన సీఎంఆర్ ఎఫ్ ను ఐసీయూలోకి నెట్టేశారు. చంద్రబుబ గారు సీఎమ్ ఆర్ ఎఫ్ కింద రూ. 1500 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పేదలకు అండగా నిలిచారని మేము కాలర్ ఎగరేసుకుని చెప్పగం .మీరు చెప్పగలరా? ఏపీ వైద్య విధానం దేశానికే ఆదర్శమని మంత్రి విడదల రజనీ మాట్లాడటం సిగ్గేచేటు. 8 వేల ఎకరాల అసైన్డ్ భూములు బీసీల నుంచి లాక్కున్నారు.

అమరావతిలో ఎస్సీ, ఎస్టీ భూమలు బలవంతగా తీసుకున్నారు. విడదల రజనీకి మనస్సాక్షి ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడరు. అసలు చంద్రబాబుగారి పేరెత్తే అర్హతే వైసీపీ నేతలకు లేదు. నాడు చంద్రబాబు గారు కేంద్రంతో మాట్లాడి ఎయిమ్స్ కు 197 ఎకరాల భూమి ఇవ్వడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించగా జగన్ రెడ్డి మాత్రం కక్షపూరితంగా ఎయిమ్స్ కు రహదారి వేయకుండా , గుక్కెడు నీళ్లు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇంతటి దుర్మార్గపు పనలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాడనడం హాస్యాస్పదం.

చంద్రబాబు స్థానంలో జగన్ రెడ్డి ఉండి ఉంటే ఎయిమ్స్ కు 9 సెంట్ల భూమి అయినా ఇస్తాడా? విడదల రజనీ ఏం మాట్లాడుతోందో ఆమెకు కూడా అర్ధం కావడంలేదు. వైద్యఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం లో అవకతవకలపై వైద్యఆరోగ్యశాఖమంత్రి మాట్లాడగలరా? కరోనా మరణాలు, మలేరియా, డెంగ్యూ మరణాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా మీకు. ప్రశ్నించిన డాక్టర్ అనితా రాణి, డాక్టర్ సుధాకర్ సహా ఎంతోమందిని మానసికంగా వేధించారు. డాక్టర్ సుధాకర్ చావుకు కారణమయ్యారు. టీడీపీ హయాంలో కోడెల శివప్రసాద్, నాగం జనార్ధన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ వంటి వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రులుగా పనిచేసి ఆదర్శంగా నిలిచారు. జగన్ రెడ్డిది దేవుడి ప్రభుత్వం కాదు..సైతాన్ ప్రభుత్వం. మాట్లాడితే చాలు….వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయంటున్నారు. 175 సీట్లలో 7 వస్తాయో 5 వస్తాయో తేల్చుకోండి. ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి.

Leave a Reply