Suryaa.co.in

Political News

దళితులారా.. మూలాలు మర్చిపోవద్దు!

– పదవుల పేరుతో మోసం చేస్తున్నారు
– కార్పొరేషన్లు నిర్వీర్యం చేస్తున్న పాలకులు
– కార్పొరేషన్ నిధులు మళ్లించిన ఏకైక సీఎం జగన్

దేశం లో ఎస్. సి కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసిన ముఖ్య మంత్రి ఒక్కరు కూడా లేరు. ఎస్. సి కార్పొరేషన్ కి నిధులు NSFDC.. NSKFDC సంస్థ ల ద్వారా కేంద్రం సమకూరుస్తుంది.
ఎస్.సి.పి పేరుతో గ్రాంటులు కూడా ఇస్తుంది.ఈ నిధులతో భూమి కొనుగోలు పథకం, పండతోటల పెంపకం నుండి.. ఆటో, టెంట్ హౌస్, ట్రాక్టర్, కార్లు ఇన్నోవా కార్ల వరకూ ఉపాధి కోసం కార్పొరేషన్ ఇస్తుంది. కంప్యూటర్ ట్రైనింగ్ నుండి వివిధ ఉపాధి ఇచ్చే కోర్స్ లు..వరకూ కార్పొరేషన్ నిధులు సమకూరుస్తుంది, పోటీ పరీక్షలకుకూడా నిధులు కేటాయిస్తుంది.మాల, రెల్లి, మాదిగ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పుడు మన నిధులు మనకి వస్తాయి కదా అని ఆ వర్గాలు సంబరపడ్డాయి.

sc-corporationకానీ రూపాయి కూడా కేటాయించకుండా ఆ కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలు చేయడం.. క్రియా సూన్యం గా మార్చడం అతి పెద్ద విషాదం. చుండూరు, వేంపెంట, కారం చేడు లాంటి సంఘటనల్లో దళితులను ఊచకొత కోసినపుడు సభ్యసమాజం మొత్తం ఘోర్నిల్లింది. బాధా సర్ప ద్రస్టులకు అండగా నిలిచింది.ఈ సంఘటన వాటి కంటే తక్కువ కాదు. అప్పుడు పదుల సంఖ్యలో వ్యక్తులను భౌతికంగా నిర్మూలిస్తే.. ఇప్పుడు వాళ్ళ హక్కులు కాలరాచి లక్షల్లో నిర్జీవులను చేస్తున్నారు అంతే తేడా.. ఇంతగా ఎందుకు చెబుతున్నాను అంటే… ఒక ఎకరా భూమి ఇస్తేనో… ఒక ఇన్నోవా కారు ఇస్తేనో, ట్రైనింగ్ ఇస్తేనో కష్టం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకొంటారు అమ్మ ఓడి పేరుతోనో…మరో పధకం పేరుతోనో వాళ్ళ హక్కులు హరిస్తే ఆ దగా పడే జీవులు ఎవరికి చెప్పు కోవాలి? ఆంధ్రజ్యోతిలో వార్త వస్తే ఎల్లో మీడియా అని కొట్టి పారేస్తారు.. దాని వల్ల ఎవరికి లాభం?

వైసీపీ దళిత శాసన సభ్యులూ, పార్లమెంట్ సభ్యులారా అంబేద్కర్ ఇచ్చిన హక్కు తోనే మీరు చట్ట సభ ల్లోకి వచ్చారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.. ప్రభుత్వం కార్పొరేషన్ లను పడకేయిస్తే నష్ట పోయేది.. నీ తమ్ముడో, చెల్లి లో, ఆమ్మో, అన్నో అన్న విషయం ఆత్మవలోకనం చేసుకోండి. మీ లాంటి వాళ్ళ గురించి అంబేద్కర్.. గారు ఆ రోజే బాధ పడ్డారు.

“నా వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్స్ అవుతున్నారు గానీ వాళ్ళు వాళ్ళ గురించి, వ్యక్తి గత కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు గానీ తమ జాతి సమాజం, గురించి ఆలోచించడం లేదని వాపోయారు.70..ఏళ్ల తర్వాత కూడా ఇదే వేదన వెన్నాడుతుంది.
“నేను గుడారానికి పెట్టిన నిట్టాడలా వున్నాను. నేను కూలి పోతే నా జాతి పరిస్థితి ఏంటి “అని అప్పుడే ప్రలాపించారు.ఇది ఇప్పుడు నిజం అవుతుంది. ఒకవైపు హక్కులు హరించబడుతుంటే పెదవి విప్పరు.. ముఖ్య మంత్రి దగ్గరకు వెళ్లి కోట్లాడరు.. మరి ఎందుకు మనకు ఎమ్మెల్యే, ఎంపి పదవులు?

బాబా సాహెబ్ ఒక మాట అన్నారు “ఎవరన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు.. కానీ పొయ్యే ప్పుడు నీ గుడిసె తగల బెట్టుకోవద్దు “.. అంటే ఈ మాటలకు అర్ధం నీ రూట్స్ మర్చి పోవద్దు అని..
జగన్మోహన్ రెడ్డి అనే ధనవంతుడు పదవులు అనే భోజనం పెడితే వెళితే వెళ్లారు.. కానీ మీ మూలాలు.. జాతి ప్రయోజనాలు మర్చిపోయే హక్కు మీకు ఎక్కడిది? మీ రూట్స్ మర్చి పోతే ఎలా? ఒక్క క్షణం ఆలోచించండి.

– అర్. డి. విల్సన్
మాజీ చైర్మన్ ఎస్. సి కార్పొరేషన్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ )

LEAVE A RESPONSE