-ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు బిజెపి కృషి
-బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి ప్రగాధ సంతాపం తెలియజేస్తున్నాను. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీరు తెలంగాణలో విద్యార్థులకు, మహిళలకు భద్రత లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు తెలంగాణ సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేసీఆర్ పాలన పట్ల నేడు తెలంగాణలో ప్రతి వర్గం విసిగిపోయింది. గత 3 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల పంపిణీ మరిచిపోయింది, దీంతో 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడింది. ఎస్సీ విద్యార్థుల కోసం కేటాయించిన నిధుల్లో 50 శాతం లోపే ఖర్చు చేశారు. కళాశాలలో ర్యాగింగ్‌పై సీనియర్లు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు.
తెలంగాణలో దళితులు, వెనుకబడిన కులాలు, మహిళలు, రైతులు, విద్యార్థులపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కేసీఆర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ టూరిజంలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి పాలనతో సామాన్య ప్రజానీకం విసిగిపోయింది. బంగారు తెలంగాణ హామీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. ప్రీతి మృతి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుంది.