అదో పూరిపాక..
అక్కడ కట్టెలపొయ్యిపై
వంట చేస్తూ వృద్ధ మహిళ..
ఆమె అమ్మ..
సాక్షాత్తు
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి..
అదీ సంజీవయ్య
బయోడేటా..
ఇప్పుడున్న సిఎంలు
ఆయన కన్నా గ్రేటా..!
పదవి..
అది స్వప్రయోజనం కోసం కాదని నమ్మిన దామోదరం..
ఏనాడూ చాచలేదు చెయ్యి..
అందుకే ఆయన పదవిలో
ఉన్న రెండేళ్లు
ముందు నుయ్యి
వెనక గొయ్యి..
అయినా ధర్మాన్ని నిలుపుతూ తనదే పైచేయి..!
నెహ్రూనే మెప్పించిన ధీరుడు..
ఇందిరమ్మ మెచ్చిన ఘనుడు..
సంజీవరెడ్డి నచ్చిన
సంజీవయ్య..
నా వారసుడిగా
నువ్వే తగునయ్యా..
అంటూ అప్పగిస్తే సింహాసనం
ఆయన అధిష్టించగానే
అయింది సముచితాసనం..!
ఇటు సిక్కోలులో
వంశధారకు జీవం పోసి
అటు రాయలసీమలో
పచ్చదనానికి ఊపిరి పోసి
దామోదరం సంజీవయ్య
తానుగా భగీరథుడై..
తెలుగు నేలకు
అన్నపూర్ణ పేరును
సార్థకం చేసె..!
దళితుడైన దామోదరం
అధినేత అయితే..
నిమ్న కులస్థుడు
నీతినిజాయితీలకు మారుపేరుగా నిలిస్తే..
ప్రజలు ఆయనను దేవుడిగా నమ్మి కొలిస్తే..
పెద్దోళ్ళు నచ్చేనా..
ఉన్నత పదవిలో
కొనసాగనిచ్చేనా..
తీసేయకపోదురా కింద ఆయనెక్కిన నిచ్చెన..
తప్పని పదవీ త్యాగం..
సిఎం ఆఫీసు నుంచి
సినిమా హాలుకు
సతీసమేతంగా
నడుచుకుంటూ..
కుళ్ళు రాజకీయాలను తలచుకొని తనలో తాను నవ్వుకుంటూ..
దటీజ్ దామోదరం..
రెండేళ్ల దళిత అంబరం..
విలువలపాలనా సంబరం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286