Suryaa.co.in

Andhra Pradesh

దర్గా భూమి సజ్జల బంధువు సుబ్రహ్మణ్యం స్వాహా

• కడపజిల్లాలో ఒక దర్గా భూమిని సజ్జల బంధువు సుబ్రహ్మణ్యం స్వాహాచేస్తే అంజాద్ బాషా ఏంచేశాడు?
– జగన్ పాలనలో ముస్లింమైనారిటీలకు ఒరిగింది వేధింపులు, దాడులు, అవమానాలే
– దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అన్యాయం జగన్ మైనారిటీలకు చేశాడు.
• రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని సొంతపార్టీనేతలే ఆక్రమిస్తుంటే జగన్, అంజాద్ బాషా చోద్యంచూస్తున్నారు.
• కడపలో చంద్రబాబుకట్టించిన హజ్ హౌస్ ని శుభ్రపరిచే తీరికకూడా ఈ ప్రభుత్వానికి లేదు.
• గుంటూరులో 2000గజాల వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని తనఅల్లుడికి ఇవ్వమంటున్న వైసీపీఎమ్మెల్యే ముస్తఫాపై జగన్ ఏంచర్యలు తీసుకున్నాడు?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ అహ్మద్

సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు, వైసీపీ నేత అయిన సుబ్రహ్మణ్యం దర్గాకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే అంజాద్ బాషా చోద్యం చూశాడు. దానిగురించి ప్రశ్నించిన ముస్లిం పెద్దల్ని తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు.ముఖ్యమంత్రి జగన్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తాడేపల్లిప్యాలెస్ లో ముస్లింమత పెద్దలతో జరిపిన ఉత్తుత్తి సమావేశంతో మైనారిటీలకు ఒరిగేదేమీలేదని, ముస్లింలకు చంద్రబాబు మేలు, మంచితో పోలిస్తే, జగన్ వారికి చేసింది శూన్యమని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి మహ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“అధికారంలోకి వచ్చిన 40నెలల్లో అధికారమదంతో, అహంకారంతో ముస్లింమైనారిటీలను దారుణంగా వేధించి బలితీసుకున్న జగన్, ఇప్పుడు ఎన్నికలుసమీపిస్తుండటంలో వారిని వంచించడానికి కొత్తనాటకానికి తెరలేపాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ము స్లిం మైనారిటీలకోసం ఎన్నోప్రత్యేకపథకాలు అమలుచేశారు. ఉన్నతవిద్యకోసం మైనారిటీ యువతను విదేశాలకు పంపారు. రంజాన్ తోఫా, దుకాన్-మకాన్, దుల్హన్, షాదీముబారక్ పథకాలతో పాటు పేదముస్లింలను ప్రభుత్వఖర్చుతో హజ్ యాత్రకు పంపారు.

కడపనగరం లోని కమలాపురం నియోజకవర్గంలో 13ఎకరాల్లో రూ.29కోట్లతో టీడీపీప్రభుత్వం హజ్ హౌస్ ని నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన హజ్ హౌస్ లోని మసీదులో కనీసం ఒకచిన్నలైట్ ని కూ డా మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి అంజాద్ బాషా ఏర్పాటు చేయలేకపోయారు. కరోనా సమయంలో అక్కడపడిఉన్న గ్లౌజ్ లు, మాస్క్ లను కూడా నేటికీ ప్రభుత్వం తొలగించి, హజ్ హౌస్ ని శుభ్రపరచలేకపోయింది.

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి పీఠంకోసం మైనారిటీలను జగన్ పావులుగా వాడుకున్నాడు
ముస్లింలను ఆదుకునేది, ఉద్ధరించేది తామేనంటున్న వైసీపీనేతలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి మైనారిటీ వర్గానికి ఈ 4ఏళ్లలో ఏం చేశారో చెప్పాలి. వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని తనపార్టీ నేతలే ఆక్రమించుకుంటుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారు. గుంటూరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, తన తాతసొమ్ము అయినట్టు, 2000గజాల వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని తన అల్లుడికి కట్టబెట్టాలని బోర్డ్ కు లేఖ రాశాడు. షాదీ ముబారక్ పథకంకింద చంద్రబాబు వేలాదిమంది ముస్లిం యువతులకు పెళ్లిఖర్చులకోసం ఆర్థికసాయం చేశారు. రాష్ట్రంలోని లక్షా10వేల మంది మైనారిటీ సోదరులకు చంద్రబాబు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించారు. జగన్ 4ఏళ్లనుంచి కనీసం 4 గురు మైనారిటీయువతీ యువకులకు 4రూప యలు ఇచ్చింది లేదు. టీడీపీ ప్రభుత్వంలో పెళ్లిళ్లుచేసుకున్న ముస్లిం యువతులకు నేటికీ జగన్ రూపాయి సాయంచేయలేదు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమంది ము స్లిం సోదరుల్ని ఉన్నతవిద్యకోసం విదేశాలకు పంపాడో సమాధానంచెప్పాలి. ముస్లిం మైనారి టీ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా జగన్ దారిమళ్లించాడు. మదర్సాల్లో చదివే ముస్లింపిల్లలకు అమ్మఒడి ఇస్తానన్న జగన్, ఆహామీని ఇప్పటికీ నెరవేర్చుకోలేకపోయాడు. ఆర్థికంగా, సా మాజికంగా ముస్లింలను జగన్ అణగదొక్కుతున్నాడు. రాజమహేంద్రవరంలో అబ్దుల్ సత్తార్, నంద్యాలలో అబ్డుల్ సలాం కుటుంబాలు జగన్ దుర్మార్గపు పాలనకు బలైంది వాస్తవంకాదా? దాచేపల్లి నుంచి 100 ముస్లింకుటుంబాలను బహిష్కరిస్తే, జగన్ దానిపై స్పందించలేదు. దాచేపల్లిలో అలీషా అనేయువకుడు పోలీసులదెబ్బలకు బలైతే ప్రభుత్వంలో చలనంలేదు. ముస్లిం మైనారిటీలకు జగన్ చేసిన.. చేస్తున్న అన్యాయం ఎవరు చేయలేదు. ముఖ్యమంత్రి పీఠంకోసం జగన్ మైనారిటీలను పావులుగా వాడుకున్నాడు. ఉర్దూ పాఠశాలల్లోని టీచర్లకు కూడా జగన్ ప్రభుత్వం జీతాలివ్వడంలేదు. రాష్ట్రంలో రెండో అధికారిక భాష ఉర్దూను వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం గౌరవించడంలేదు.

ఒకరిద్దరు నేతల్ని అడ్డంపెట్టుకొని మైనారిటీ వర్గాన్ని పూర్తిగా అణచివేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు.
వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతంచేస్తున్న సొంతపార్టీవారిపై చర్యలుతీసుకునే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా? చంద్రబాబు హజ్ హౌస్ నిర్మాణానికి విజయవాడలో కేటాయిం చిన స్థలాన్ని కూడా ఈ ప్రభుత్వంలోని వారు కబ్జాచేశారు. దాన్ని విడిపించడానికి జగన్ ఏ నాడూ ప్రయత్నించలేదు. ముస్లిం మైనారిటీలను అణచివేస్తూ, వారిని రాజకీయంగా, సామాజికంగా వేధిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి రాష్ట్రంలోని మైనారిటీసోదర, సోదరీమణులంతా ఏకంకావాల్సిన సమయం వచ్చింది. ముస్లిం మైనారిటీవర్గానికి చెందిన అంజాద్ బాషా, ముస్తఫా లాంటి ఒకరిద్దరు నేతల్ని అడ్డంపెట్టుకొని జగన్ యావత్ మైనారిటీ వర్గాన్నే నాశనంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు.” అని నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE