– టీఆర్ఎస్ పెద్దల పాత్ర పై కేసీఆర్ స్పందించాలి
– నిజాయితీని నిరూపించుకోవాలంటే… సీబీఐ విచారణ జరిపించాలి
– ఏఐసిసి అధికార ప్రతినిధి. దాసోజు శ్రావణ్
క్యాసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్‌తో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రపై సీఎం కేసీఆర్ సీబీఐతో విచారణ జరిపించాలని ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టీఆర్ఎస్ నేతల పాత్రపై విచారించాలన్నారు.
ఇంకా దాసోజు ఏమన్నారంటే.. చికోటి ప్రవీణ్ టిఆర్ ఎస్ నాయకులతో కుమ్మక్కైన దానిపై కొన్ని ఆధారాలను బయటబెడుతున్నాం. ఈడీ దాడులతో చిట్టి దేవేందర్ మెదక్ డీసీసీబీ చైర్మన్ కొండపాక గ్రామంలోని బ్రాంచ్ లాకర్లలో, చికోటి కి సంబంధించిన క్యాసినో మనీ ల్యాండరింగ్ పత్రాల ఒక సూట్ కేసు… మరో సూట్ కేసు టిఆర్ ఎస్ నాయకుని ఇంట్లో డాకుమెంట్లు దాచారని వార్తలు. డాకుమెంట్లు బయటికి తెప్పించాలి…పక్షపాతం లేకుండా విచారణ చేపట్టాలి.ఈడీ అధికారులు బాంక్ లాకర్లను స్వాధీనం చేసుకోవాలి.సమగ్రమైన విచారణ జరిపించాలి.
విద్యార్థులు, నిరుద్యోగులు,ప్రజలు కష్టాలు పడుతుంటే, చికోటి తో ప్రజల సొమ్మును కాసినో ఆడుతున్నారు. తలసాని,ఎర్రబెల్లి,మల్లారెడ్డి,టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంబంగదాలపై ఎందుకు చర్యలు లేవు? వారిని విచారించాలి… టీఆర్ఎస్ పెద్దల పాత్ర పై కేసీఆర్ స్పందించాలి…నిజాయితీ ని నిరూపించుకోవాలంటే… సీబీఐ విచారణ జరిపించాలి.. చేయని తప్పుకు సోనియాగాంధీ ని ఈడీ విచారణ జరిపిస్తున్నార. కానీ ఇంత పెద్దఎత్తున మనీలాండరింగ్ జరుగుతుంటే, టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు వచ్చినా ఎందుకు విచారించడం లేదు? వారిపై చర్యలు తీసుకోవాలి.చిట్టి దేవేందర్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలి.