Suryaa.co.in

Telangana

చీఫ్ సెక్రటరీ సోమేశ్ ‘ధరణి’ దుర్మార్గాలు..కేసీఆర్ కళ్ళు తెరవాలి

– ఒక దగుల్బాజీ కంపెనీకి ధరణి కాంట్రాక్ట్ ఇచ్చారు
– జయేష్ రంజన్ ని ధరణిలో ఎందుకు భాగం చేయలేదు ?
– కేసీఆర్ ప్రేమ ఖరీదు.. భూయజమానులని బిచ్చగాళ్ళగా మార్చడమా ?
– సోమేశ్ కుమార్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
– ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ మండిపాటు

ధరణి ఒక లోపాల పుట్ట. ధరణి సమస్యలని ఎంతమంది ఎన్ని సార్లు మోర పెట్టుకున్నా చీఫ్ సెక్రటరీ స్పందించడం లేదు. తెలంగాణ ప్రజల భూములు తన ప్రైవేట్ ఆస్తులు అయినట్లు సిఎం కేసీఆర్ సామర్ధ్యం లేని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి ఎందుకు కట్టబెట్టారు ? సాంకేతిక నిపుణుడైన ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ని ధరణిలో ఎందుకు భాగం చేయలేదు ?

ధరణి పని తీరు చూశాక దేశంలో ఇంత లోపభూయిష్టమైన పోర్టల్ మరొకటి లేదని తేలింది. టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధతకు ఇది నిదర్శనం.
ఒక దగుల్బాజీ కంపెనీకి ధరణి కాంట్రాక్ట్ ఇచ్చారు. టీసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సాంకేతిక సామర్ధ్యం, అనుభవం వున్న కంపెనీలు పక్కన పెట్టి.. దివాలా తీసిన ఓ కంపెనీకి ధరణి కట్టబెట్టారు. తెలంగాణ ప్రజల ఆస్తి హక్కుని ఇవాళ ఒక దివాలా తీసిన దగుల్బాజీ కంపెనీ చేతిలో పెట్టిన సిఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములనువారి దగ్గర నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం తీవ్ర కుట్ర పన్నుతున్నది.
ఒక సర్వే నెంబర్ లో పీఓబీ కిందకి ఒక అర ఎకరం భూమి వుంటే.. మిగతా భూమిని కూడా పీఓబీలో చేర్చడం దుర్మార్గం. పీఓబీ ని ఎప్పుడు ఎత్తివేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి.
ధరణి ఒక తప్పుల తడక. సమస్యల వలయం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కబంధ హస్తల నుంచి ధరణి బయటకి తీసి .. సమస్యలు పరిష్కరించాలి.

”ధృతరాష్ట్రుని రాచరికంలో దుర్యోదున పాలన చేసినట్లు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పై వున్న ప్రేమతో తెలంగాణలో భూ యజమానులని బిచ్చగాళ్ళుగా మార్చేశారు. కేసీఆర్ ప్రేమ ఖరీదు .. ప్రజలని బిచ్చగాళ్ళగా చేయడమా ‘ అని మండిపడ్డారు ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ధరణి పోర్టల్ లోని సమస్యలు, లోపాలపై గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు దాసోజు.

ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. ‘ధరణి ఒక లోపల పుట్ట. ధరణి సమస్యలని ఎంతమంది ఎన్ని సార్లు మోరపెట్టుకున్న చీఫ్ సెక్రటరీ స్పందించడం లేదు. ధరణి లాంటి పోర్టల్ అమల్లోకి తెచ్చేటప్పుడు సాంకేతిక, పాలన సమర్థత కావాలి. చీఫ్ సెక్రటరీ రెవెన్యులో పనిచేశారు కాబట్టి పాలనలో సమర్దత వుందని అనుకుందాం. మరి సాంకేతిక సమర్థత ఎక్కడిది? ధరణి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్న చీఫ్ సెక్రటరీ ఇన్ని సమస్యలకు కారణం అవుతున్నారు ?

సాంకేతిక నిపుణుడైన ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ని ధరణిలో ఎందుకు భాగం చేయలేదు ? ప్రైవేట్ ఆస్తులు అయినట్లు సిఎం కేసీఆర్ తెలంగాణ భూములు, రికార్డులు సామర్ధ్యం లేని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి ఎందుకు కట్టబెట్టారు ? అని ప్రశ్నించారు దాసోజు.

”కొండనాలుకకి మందు వేస్తే వున్న నాలుక ఊడిపోయినట్లుగా వుంది ధరణి పోర్టల్ తీరు. ధరణి పోర్టల్ ఒక లోపల పుట్ట. ఒక ఆలోచన లేకుండా, చర్చలేకుండా, ఎవరితో సంప్రదింపులు జరపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్ధతో రూపొందించిన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణలో భూ యజమానులంతా బిచ్చగాళ్ళుగా మారిపోయి ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసుల దగ్గర దిక్కుతోచని స్థితిలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది ” అని పేర్కొన్నారు దాసోజు.

”తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ సర్వే జరిపి భూసమస్యలని సంపూర్ణంగా పరిష్కరించాలని అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్డి ఎద్దు చెలో పడినట్లు అనాలోచితంగా, భూ సర్వే చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. ధరణి సృష్టించిన సమస్యలు కారణంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితి నెలకొంది. మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు కూడా వారు యజమానులు కాదని ధరణి చూపిస్తుంది. లక్షల మందికి గ్రీ పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. అనేక సర్వే నెంబర్లు మాయమైయ్యాయి. వెల్లడించారు దాసోజు.

”ధరణి లాంటి పోర్ట్ తీసుకొచ్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. శాంకేతిక సమస్యలు ఏమైనా వస్తాయా ? అని ఒకటికి రెండు సార్లు పైలట్ చేసుకోవాలి. కానీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నేరుగా లాంచ్ చేశారు. ధరణి పని తీరు చూశాక దేశంలో ఇంత లోపభూయిష్టమైన పోర్టల్ మరొకటి లేదని తేలింది. టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధతకు ఇది నిదర్శనం. ఒక దగుల్బాజీ కంపెనీకి ధరణి కాంట్రాక్ట్ ఇచ్చారు. టీసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ కంపెనీలు, సాంకేతిక సామర్ధ్యం, అనుభవం వున్న కంపెనీలు పక్కన పెట్టి దివాలా తీసిన ఓ కంపెనీకి ధరణి కట్టబెట్టారు. తెలంగాణ ప్రజల ఆస్తి హక్కుని ఇవాళ ఒక దివాలా తీసిన దగుల్బాజీ కంపెనీ చేతిలో పెట్టిన సిఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు” అని మండిపడ్డారు దాసోజు.

ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఓ కుట్ర చేస్తుంది. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములనువారి దగ్గర నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం తీవ్ర కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది. దిన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని పేర్కొన్నారు దాసోజు.

సెక్షన్ -22 A కింద చాలా పట్టా భూములు పీఓబీ లో తప్పుగా చేర్చబడ్డాయి. కోర్టు కేసు, సీలింగ్, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్ , ఒక గుంట ప్రభుత్వ భూమి.. ఒక సర్వే నంబర్‌లో ఉంటే, ఆ సర్వే నంబర్‌లో మొత్తం భూమిని ధరణి అటోమేటిక్ గా లాక్ చేస్తుంద. దీంతో రైతులు తమ అత్యవసర అవసరాలకు కూడా తమ భూమిని వినియోగించకోలేని పరిస్థితి దాపురించింది. పీఓబీ కిందకి ఒక అర ఎకరం భూమి వుంటే మిగతా భూమిని కూడా పీఓబీ చేర్చడం దుర్మార్గం. పీఓబీ ని ఎప్పుడు ఎత్తివేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి.” అని డిమాండ్ చేశారు దాసోజు. భూమిలేని వారికి వున్నట్లు , వున్న వారికి లేనట్లు , తక్కువ భూమి వున్న వారికీ ఎక్కువ భూమి, ఎక్కువ భూమి వున్న వారికీ తక్కువ భూమి చూపిస్తుంది ధరణి. దీంతో అనేక లీగల్ సమస్యలు వచ్చి పడుతున్నాయి. అలాగే డిజిటలైజేషన్ తర్వాత ధరణి పోర్టల్‌లో చాలా సర్వే నంబర్లు కనిపించడం లేదు.” అని పేర్కొన్నారు దాసోజు.

”2020కి ముందు తమ భూములను అమ్మేసిన పాత పట్టాదార్ల పేర్ల ధరణి పోర్టల్ కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి భూమిని అమ్ముకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాగే రైతు బంధు ప్రయోజనాలను కూడా పాత పట్టాదారులే పొందుతున్నారు. పట్టా భూములు కూడా ప్రభుత్వ భూమి, నాలా, అసైన్డ్ భూములుగా తప్పుగా అప్‌డేట్ అవుతున్నాయి. మాజీ సైనికులు /స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములు ప్రభుత్వ భూమిగా అప్‌డేట్ అవుతుంది. 10 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత కూడా సెక్షన్ 22-A కింద పీఓబీ గా ధరణి పోర్టల్ తప్పుగా చూపిస్తుంది. 2018 నుంచి దాదాపు లక్షలాది మంది పట్టాదార్లకు కొత్త గ్రీన్ పాస్‌బుక్‌లు రాలేదు. ఓఆర్సి పత్రాల జారీ పూర్తిగా ఆగిపోయింది. ధరణి పోర్టల్‌లో ఓఆర్సి పత్రాల జారీకి ఎటువంటి నిబంధన ఇవ్వలేదు. అలాగే ధరణి పోర్టల్‌లో సాదాబైనామా క్రమబద్ధీకరణకు ఎలాంటి నిబంధన లేదు. 9 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి” అని వెల్లడించారు దాసోజు.

”ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ధరణి సమస్యలు సత్వరంగా పరిస్కారించాలి. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కబంధ హస్తల నుంచి ధరణి బయటకి తీసి, నాలుగు కోట్ల మంది భూములని కాపాడండి. ఇష్టారాజ్యంగా 20లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్పై చర్యలు తీసుకొండి” అని కోరారు దాసోజు.

LEAVE A RESPONSE