47వ జి ఎస్ టి కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గౌరవార్ధం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయరాజ్ భవన్ లో మర్యాదపూర్వక విందుకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో విందులో పాల్గొన్న అనంతరం బండారు దత్తాత్రేయ , ఇరువురు ఆర్ధిక మంత్రులను సన్మానించి ప్రతిష్టాకరమైన కురుక్షేత్ర ప్రతిమలను వారికి బహూకరిం చారు. ఇరువురు మంత్రులు గవర్నర్ బండారు దత్తాత్రేయకి కృతజ్ఞతలు తెలిపారు.