Suryaa.co.in

Telangana

పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కొడకండ్ల, సెప్టెంబర్ 20 : కొడకండ్ల మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నూనెముంతల వినోద భర్త సత్తయ్య అనారోగ్య0తో మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బుధవారం సత్తయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అనంతరం అంత్యక్రియలో పాల్గొని పాడే మోశారు. అదేవిధంగా ఏడు నూతుల గ్రామానికి చెందిన కుదురుపాక రాములు మృతి చెందగా మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, ఈ జి స్ కౌన్సిల్ సభ్యులు అందే యకయ్య, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, సీనియర్ నాయకులు చెంచు రాజిరెడ్డి, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE