Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు అరెస్ట్ పై ప్రెస్ మీట్ పెట్టి.. ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము నీకుందా జగన్ రెడ్డి?

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
– రెండు జిల్లాలలో, ఐదు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి చంద్రబాబు
నాయుడు అక్రమ అరెస్టుపై తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జరుగుతున్న సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనేందుకు ఉదయం 10.30 గంటలకు పొన్నూరు నియోజకవర్గంలో పాల్గొని అక్కడి నుండి 12.30 గంటలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాల్గొని 03.00 గంటల సమయంలో గన్నవరం నియోజకవర్గంలో పాల్గొని 04.00 గంటల సమయంలో పామరు నియోజవర్గం మొవ్వా మండలంలో పాల్గొని అక్కడి నుండి నేరుగా మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందజేసి దీక్ష విరమింప జేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…..చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుంది.ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పెద్ద యెత్తున నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నయి.రాబోయే తరాల గురించి ముందుగానే ఆలోచించే గొప్ప విజన్ వున్న నాయకుడు చంద్రబాబు.చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడానికి 2017 లోనే ప్లాన్ చేసుకున్నాడు ఈ జగన్ రెడ్డి.కానీ ఏక్కడ ఏటువంటి అవినీతి జరగలేదు అని తేలడం తో…ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్రమ చేయించాడు.

నిరసన తెలియజేయడనికి వస్తున్న కార్యకర్తలను పోలీస్ లు అక్రమ హౌస్ అరెస్టులు చేస్తున్నారు.ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేసే హక్కు లేకుండా పోయింది. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యంగo పోయి రాజారెడ్డి రాజ్యంగo అమలవుతుంది.బీసీలు ని అనగదొక్కే కార్యక్రమం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి… త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం.ప్రతి గుండెను టచ్ చేస్తాం చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును వివరిస్తాం.

రాష్ట్రంలో త్వరలో చంద్రబాబు నాయుడు అనే నేను మాట వినపడబోతుంది.చంద్రబాబు నాయుడునీ జైల్ లో పెట్టి నువ్వు ఆనంద పడుతున్నవేమో జగన్ రెడ్డి… త్వరలో నువ్వు నిద్రలేని రాత్రులు గడపబోతున్నావు గుర్తుపెట్టుకో.ఈ రోజు 144 సెక్షన్ పెట్టి మమ్మల్ని నిలువురించాలని ప్రయత్నిస్తే మహా ఉద్యమంగా తయారవుతాం.

నిరసన తెలియజేయడనికి వస్తున్న కార్యకర్తలను పోలీస్ లు అక్రమ హౌస్ అరెస్టులు చేస్తున్నారు.కానీ మొన్న గుంటూరు జిల్లాలో పదివేల మంది మహిళల స్వచ్ఛందంగా చంద్రబాబు కోసం రోడ్డు ఎక్కారు.అడ్డొచ్చిన పోలీస్ వాహనాన్ని తొక్కుకుంటూ పోయారు.నీకు కౌన్ డౌన్ స్టార్ట్ అయింది జగన్ రెడ్డి.ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన తెలుగోడిని ఉన్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను అన్న చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నాం.

LEAVE A RESPONSE