– క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
డి ఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ధాన్యం కేటాయించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటైన సబ్ కమిటీ రెండవ సమావేశంలో వారు స్పష్టం చేశారు.
డిఫాల్టర్లు బియ్యాన్ని మొత్తం త్వరితగతన ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. డి ఫాల్టర్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
సన్న బియ్యం 100 కేజీలు బిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం వస్తుందని, 100 కేజీల దొడ్డు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కేజీల బియ్యం వస్తుందని , TRANSPORT, కస్టడీ, మిల్లింగ్ చార్జీల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిందని మిల్లర్లు సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
కమిటీ సభులైన మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబులు online లో సమావేశములో పాల్గొన్నారు. సమావేశంలో స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, రఘునందన్ రావు, కమిషనర్ DS చౌహన్, జిఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.