Suryaa.co.in

Telangana

లష్కర్ లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

అధికారులకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశాలు

సికింద్రాబాద్, మే 29 : పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం చాటడంతో పాటు గడచిన తొమ్మిదేళ్ళలో సికింద్రాబాద్ లో జరిగిన అభివృద్దిని ప్రజలకు తెలియచెప్పేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ పండుగ వాతావరణంలో జరుపాలని అయన సూచించారు.

దశాబ్ది ఉత్సవాల వేడుకల పై సికింద్రాబాద్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం సీతాఫల్మండి లోని తన క్యాంపు కార్యాలయంలో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని ప్రజలకు విపులీకరించాలా ఏర్పాట్లు జరపాలని సూచించారు.

ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని గుర్తించాలని సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూనే సికింద్రాబాద్ నియోజకవర్గ స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. గత 50 సంవత్సరాల్లో చేపట్టనని పనులను కేవలం 9 సంవత్సరాల్లో చేపట్టామని తెలిపారు. తుకారం గేట్ వద్ద ఆర్ యు బీ ని నిర్మించడం తమ విజయమని తెలిపారు.

జూనియర్, డిగ్రీ కాలేజీలను సాధించి విజయవంతంగా నడుపుతున్నామని, వాటికి రూ.30 కోట్ల ఖర్చుతో కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రిని కొత్తగా వంద పడకల ఆసుపత్రిగా నిర్మించందుకు నిధులు మంజురయ్యయని తెలిపారు. కొత్తగా స్విమ్మింగ్ పూల్ ను సికింద్రాబాద్ చరిత్రలో తొలిసారిగా నిర్మిస్తున్నామని, సితాఫలమండీ లో ఫంక్షన్ హాల్ కు అదనంగా లాలాపేట, అడ్డగుట్ట లో కొత్తగా ఫంక్షన్ హాల్స్ పనులు వేగంగా చేపట్టామని తెలిపారు.

తెలంగాణా రాష్ట్రం సాధించుకోవడం వల్ల ఎన్నో ప్రయోగానాలు ప్రజలకు కలిగాయని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఆయా అంశాలను ప్రజలకు తెలపాలని, ఉత్సవాల నిర్వహణ భారీ స్థాయిలో చేపట్టేల సహకరిస్తామని తెలిపారు. తమ కార్యాలయం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

జూన్ 2 న అవతరణ దినోత్సవ వేడుకలు మొదలు కొని అన్ని నిర్దారిత తేదిల్లో, జూన్ 4వ తేదీ – ఆదివారం – సురక్షా దినోత్సవం, జూన్ 5వ తేదీ – సోమవారం – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం, జూన్ 6వ తేదీ – మంగళవారం – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, జూన్ 9,శుక్రవారం – తెలంగాణ సంక్షేమ సంబురాలు( ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో )జూన్ 10వ తేదీ, శనివారం – తెలంగాణ సుపరిపాలన దినోత్సవం ( పరిపాలన సంస్కరణలు, ఫలితాలు) , జూన్ 11వ తేదీ, ఆదివారం – తెలంగాణ సాహిత్య దినోత్సవం, జున్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్ ( తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి. ఈ రన్ కార్యక్రమం పోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది. క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి), జూన్ 13 కార్యక్రమం..మంగళవారం – తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, జూన్ 14 నాడు వైద్య, ఆరోగ్య సేవల దినోత్సవం, జూన్ 19వ తేది నాడు హరిత హారం వంటి అన్ని కార్యక్రమాలు బల్దియా తో పాటు అన్ని విభాగాల సమన్వయంతో నిర్వహించాలని డిప్యూటీ స్పీకర్ ఈ సందర్భంగా ఆదేశించారు. డిప్యూటీ కమీషనర్ దశరద్ తో పాటు ఈ ఈ ఆశలత, టౌన్ ప్లానింగ్ అధికారి ముంతాజ్ బేగం లతో సహా బల్దియా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE