– టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
మా సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపే. టిడిపిలో బలమైన బీసీ నేతలని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకి జగన్‌రెడ్డి పాల్పడుతున్నారు. చోడవరం మినీమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడనే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడి ఇంటిపై చీకటి దాడులు చేయించారు. అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చే దమ్ములేని జగన్‌రెడ్డి కూల్చివేతలకి పాల్పడ్డారు. అయ్యన్నపాత్రుడి వెంట తెలుగుదేశం పార్టీ ఉంది.