రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు,అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టు చెయ్యడం చాలా దారుణమని గుంటూరు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ మండిపడ్డారు.పొన్నూరు నియోజకవర్గం అనుమర్లపూడి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ని అడ్డుకోకుండా ప్రభుత్వమే వారికి కొమ్ముకాయటం సిగ్గుమాలిన పని అని అన్నారు.జగనన్న కాలనీ పేరుతో పంచాయతీ తీర్మానం చేసి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు.అనుమర్లమూడి గ్రామంలోని మంచినీటి చెరువులో అనుమతు లు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు.ట్రాక్టర్ మట్టి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు.
ప్రజలకోసం తెలుగుదేశం పార్టీ పోరాడే ప్రతి కార్యక్రమానికి పోలీసుల్ని అడ్డుపెట్టుకొని హౌస్ అరెస్టు లు చెయ్యడం తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి , అక్రమ మైనింగ్ మాఫియా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నించారు.పోలీసులు నిష్పక్షపాతంగా ప్రజా వ్యవస్థ కు సేవాలందించకుండా…. వైసీపి కార్యకర్తలు గా విధులు నిర్వహించడం దౌర్భాగ్యం అని అన్నారు.ఇలా దౌర్జన్యాలు చేస్తే భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఇప్పటికైనా అధికారులు,పోలీసులు పొన్నూరు నియోజకవర్గంలో , రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ , అవినీతిని పై సమగ్రమైన విచారణ జరిపి నిందితులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.