Suryaa.co.in

National Political News

దేశంలోనే అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ!

-సమర్ధుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి ,కేజ్రీవాల్

ఒక్క రూపాయి అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ గుర్తింపు పొందింది. కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా వచ్చే సమయానికి ఆ రాష్ట్రం అప్పుల బారిన పడి ఉంది.ఐ ఆర్ ఎస్ అధికారి నుండి రాజకీయవేత్త గా మారి ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ అప్పుల పరిస్థితి నుండి ఆ రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి తన సమర్థతను చాటుకున్నారు.

ఢిల్లీ రాష్ట్రంలో అన్ని వ్యాధులకూ ప్రజలకు వైద్య సేవలు , 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా అందిస్తున్నారు. అన్ని పాఠశాలూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.అవి ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయి. మన రాష్ట్రంలో చాప చుట్టేసి అటకెక్కించిన ఆనంద వేదిక ఢిల్లీలో (Happiness Curriculum) అద్భుతంగా నడుస్తోంది. కేజ్రీవాల్ , ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాలు ఎప్పుడూ ఏదో ఒక పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉంటారు.పాఠశాలలను పర్యవేక్షించే టప్పుడు ప్రధానోపాధ్యాయుల కు ఎదురుగా ఉండే సీట్లో మాత్రమే వారు కూర్చుంటారు.

అక్కడ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయునితో పాటుగా ఎస్టేట్ మేనేజర్ అనే వేరొక ప్రధానోపాధ్యాయులు ఉంటారు. పాఠశాలకు అవసరమయ్యే వసతులు, నిర్వహణ, వివిధ ఏర్పాట్లు, మరమ్మతులు ఈ ఎస్టేట్ మేనేజర్ ఎప్పటికప్పుడు చూసుకుంటారు. ప్రధానోపాధ్యాయుని పై కేవలం అకడమిక్ బాధ్యతలు మాత్రమే ఉంటాయి.

ఇటీవల కేజ్రీవాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరిట పప్పుబెల్లాలు పంచుతున్నాయని ఈ విధానం బ్యాడ్ పాలిటిక్స్ అని స్పష్టం చేశారు.చక్కటి అవగాహనతో, సమర్థతతో, దార్శనికతతో ఢిల్లీ ప్రజలను ముందుకు తీసుకు వెళ్తున్న కేజ్రీవాల్ కి దేశంలోని పేద ప్రజలు మేధావులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

LEAVE A RESPONSE